NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / థమన్ పై మళ్ళీ ట్రోలింగ్: ఈసారి స్కంద సాంగ్ కాపీ అంటూ విమర్శలు 
    తదుపరి వార్తా కథనం
    థమన్ పై మళ్ళీ ట్రోలింగ్: ఈసారి స్కంద సాంగ్ కాపీ అంటూ విమర్శలు 
    స్కంద మొదటి పాట కాపీ అంటూ థమన్ పై విమర్శలు

    థమన్ పై మళ్ళీ ట్రోలింగ్: ఈసారి స్కంద సాంగ్ కాపీ అంటూ విమర్శలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 04, 2023
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న థమన్ పై ట్రోలింగ్ సర్వ సాధారణంగా మారిపోయింది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న థమన్ పై తాజాగా స్కంద సాంగ్ విషయంలో ట్రోలింగ్ జరుగుతోంది.

    రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్కంద సినిమా నుండి నీ చుట్టు చుట్టూ అనే పాట విడుదలైంది.

    శ్రీలీల, రామ్ పోతినేని ఖతర్నాక్ స్టెప్పులతో పాట మోత మోగిస్తోంది.

    అయితే ఈ పాటను థమన్ కాపీ చేసాడంటూ ట్రోల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలోని 'ట్రింగ్ ట్రింగ్' అనే పాట మాదిరిగా స్కంద పాట వినిపిస్తోందని అంటున్నారు.

    Details

    ట్రోలింగ్ ని లైట్ తీసుకుంటున్న థమన్ 

    పాటలను కాపీ చేసాడంటూ థమన్ పై ట్రోలింగ్ కొత్తేమీ కాదు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఏ పాట రిలీజైనా కాపీ అంటూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.

    ఈ విషయమై ఒకానొక ఇంటర్వ్యూలో థమన్ స్పందించారు కూడా. ఈ ట్రోలింగ్స్ ని మొదట్లో చాలా సీరియస్ గా తీసుకున్నారట. ఆ తర్వాత అంత సీరియస్ గా తీసుకోవట్లేదని థమన్ అన్నారు.

    అదలా ఉంచితే, థమన్ చేతిలో ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న ఓజీ, బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలోని భగవంత్ కేసరి ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025