Page Loader
Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు!

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 15, 2025
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌, మాస్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రానుంది. ఈ బిగ్ బడ్జెట్‌ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌ రూ. 800 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ మాత్రం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే విధంగా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. అల్లు అర్జున్‌, అట్లీ కలిసి చర్చలు జరిపిన వీడియోను రిలీజ్ చేయడం, అంతే కాకుండా వీరిద్దరూ అమెరికా వెళ్లి అక్కడి వీఎఫ్‌ఎక్స్ కంపెనీలను కలిసిన విజువల్స్‌ను బహిర్గతం చేయడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. . ఈ పనులన్నీ చూస్తుంటే ఇది కచ్చితంగా ఓ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌ అవుతుందనే మాట వినిపిస్తోంది.

Detals

జాన్వీ కపూర్, దిశా పటానీలో చర్చలు

మొదటి నుంచి ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోయిన్‌లను తీసుకుంటున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ గ్లామర్ డివాస్‌ జాన్వీ కపూర్‌, దిశా పటానీతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ఇద్దరూ పాన్‌ ఇండియా స్థాయిలో పాపులర్‌ హీరోయిన్స్‌ కాగా, వారి గ్లామర్‌ అండ్‌ ఫ్యాన్‌ బేస్‌ను బట్టి సెలెక్షన్ చేసినట్టు తెలుస్తోంది. వీరితో కాస్త హాట్ అండ్‌ యాక్షన్ మిక్స్‌ ఫీలును తెరపై చూపించనున్నారని బజ్‌. త్వరలోనే ఈ ఇద్దరి పేర్లపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Details

త్వరలోనే అధికారిక ప్రకటన

ఇక ఈ చిత్రానికి సంబంధించి మిగతా నటీనటుల ఎంపిక పనులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. అంతేకాదు, హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం కాబోతున్నారన్న ప్రచారం జోరుగా ఉంది. కానీ ఈ విషయంలో ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. మొత్తానికి అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో మరో మైలురాయిగా నిలవనుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.