Vishal: ఉదయనిధి అరెస్ట్ ఊహించలేదు.. ఇదంతా పొలిటికల్ గేమ్ : విశాల్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయ నాయకులు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు మాటలను ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రముఖ నటుడు విశాల్ సూచించారు. ఆయన దర్శకత్వం వహించి, హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మకుటం' (తమిళంలో 'మగుడం') ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్, నటి త్రిషపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అంశాలపై స్పందించారు. సభల్లో ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రసంగాలు చేస్తే సాధారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తవని, అయితే అప్పటికప్పుడు మాట్లాడే సమయంలోనే అనుకోకుండా తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశాల్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఇవన్నీ రాజకీయ ఆటలో ఒక భాగమే
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లయోలా కాలేజీలో నా సీనియర్ విజయ్, నా బ్యాచ్‌మేట్ ఉదయనిధి స్టాలిన్‌ను ఒక రోజు ఇలా అరెస్ట్ చేస్తారని కలలో కూడా ఊహించలేదు.
ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో ఉన్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ రాజకీయ ఆటలో భాగమేనని విశాల్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, తమిళనాడు రాజకీయాల్లో విశాల్ ప్రవేశించనున్నారనే ఊహాగానాలు కూడా ఇటీవలి కాలంలో జోరుగా వినిపిస్తున్నాయి. ఆయన తాజా వ్యాఖ్యలతో ఈ చర్చలకు మరింత ఊతం లభించింది.