Loading...
Udta Teer: పాకిస్థాన్ ఏజెంట్‌.. ఇండియాకు వచ్చి దేశభక్తుడైతే! 'ఉడ్తా తీర్' ట్రైలర్ అదుర్స్

Udta Teer: పాకిస్థాన్ ఏజెంట్‌.. ఇండియాకు వచ్చి దేశభక్తుడైతే! 'ఉడ్తా తీర్' ట్రైలర్ అదుర్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా, నటి సారా అలీ ఖాన్‌ జంటగా నటిస్తున్న యాక్షన్‌-కామెడీ చిత్రం 'ఉడ్తా తీర్‌' (Udta Teer). ఆకాష్‌ ఎ. కౌశిక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌ విడుదలైన వెంటనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్పై థ్రిల్లర్‌కు కామెడీని జోడించి రూపొందించిన ఈ సినిమా కథ ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

వివరాలు 

పాకిస్థాన్‌ ఏజెంట్‌గా ఆయుష్మాన్

ఈ చిత్రంలో ఆయుష్మాన్‌ ఖురానా 'బిలాల్‌' అనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నారు.

ఓ రహస్య మిషన్‌లో భాగంగా అతడు భారత్‌కు వస్తాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ప్రమాదానికి గురై తన జ్ఞాపకశక్తిని కోల్పోతాడు.

దీంతో తాను పాకిస్థాన్‌ తరఫున గూఢచారిగా భారత్‌లోకి వచ్చానన్న విషయమే అతడికి గుర్తుండదు.

తానే CTS ఆఫీసర్‌ అనుకుంటాడు!

జ్ఞాపకశక్తి కోల్పోయిన బిలాల్‌ భారత్‌లో ఉన్న సమయంలో మరో విచిత్రమైన పరిణామం చోటుచేసుకుంటుంది. అతడిలో దేశభక్తి పెరిగిపోతుంది.

అంతేకాదు.. తాను ఇండియా కౌంటర్‌ టెర్రరిజం స్క్వాడ్‌ (CTS)కు చెందిన అధికారినని బలంగా నమ్మడం మొదలుపెడతాడు.

దీంతో పాకిస్థాన్‌ పంపిన గూఢచారి కాస్తా.. భారత్‌కు అనుకూలంగా మారి దేశభక్తుడిగా వ్యవహరించడం మొదలుపెడతాడు.

వివరాలు 

హ్యాండర్లకు తలనొప్పిగా మారిన ఏజెంట్

తమ మిషన్‌ కోసం భారత్‌కు పంపిన వ్యక్తి అక్కడికి వెళ్లి అసలు విషయాన్నే మర్చిపోవడం, పైగా భారతదేశానికి అనుకూలంగా మారడంతో పాకిస్థాన్‌ హ్యాండర్లకు కొత్త సమస్య ఎదురవుతుంది.

బిలాల్‌ను తిరిగి తమ వైపు తీసుకురావడానికి వారు చేసే ప్రయత్నాలు, అతడికి ఎదురయ్యే పరిస్థితులు సినిమాలో కామెడీకి ప్రధాన కారణంగా నిలవనున్నాయి.

ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలు ఏమిటన్నదే 'ఉడ్తా తీర్‌'లో ఆసక్తికరమైన అంశం.

పవర్‌ఫుల్‌ CTS ఆఫీసర్‌గా సారా

ఈ సినిమాలో సారా అలీ ఖాన్‌ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

పవర్‌ఫుల్‌ CTS ఆఫీసర్‌గా ఆమె పాత్ర ఉండబోతున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది.

యాక్షన్‌, కామెడీతో పాటు ఆయుష్మాన్‌, సారా మధ్య సన్నివేశాలు సినిమాకు మరింత వినోదాన్ని అందించేలా కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

దర్శకుడిగా ఆకాష్‌ ఎ. కౌశిక్‌ పరిచయం

'ఉడ్తా తీర్‌'తో ఆకాష్‌ ఎ. కౌశిక్‌ దర్శకుడిగా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.

కరణ్‌ జోహార్‌కు చెందిన 'ధర్మ ప్రొడక్షన్స్‌', గునీత్‌ మోంగా కపూర్‌కు చెందిన 'సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్‌' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

రాహుల్‌ బోస్‌, రామ్‌ కపూర్‌, గుల్షన్‌ గ్రోవర్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

స్పై థ్రిల్లర్‌ అంశాలకు కామెడీని జోడించిన ఈ ఎంటర్‌టైనర్‌ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 9న థియేటర్లలో విడుదల కానుంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'ఉడ్తా తీర్‌' ట్రైలర్‌ విడుదల

ADVERTISEMENT