Rambha: రంభ కుటుంబంలో తీరని విషాదం.. తండ్రి కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 25, 2026
05:01 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రంభ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి వెంకటేశ్వరావు అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఈ వార్తతో రంభ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. రంభ సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా ఎదిగే ప్రయాణంలో ఆమె తండ్రి కీలకంగా అండగా నిలిచారు. ఆయన మరణం రంభ జీవితంలో తీరని లోటుగా మారింది.
వివరాలు
నువ్వు లేకుండా నేను లేను నాన్న
తన తండ్రి మృతిపై రంభ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా స్పందించారు. "నువ్వు లేకుండా నేను లేను నాన్న.. నా జీవితంలో నువ్వు నింపిన శూన్యాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను" అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు రంభకు మరియు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.