
అన్ స్టాపబుల్ సెట్లో పవన్ తో పాటు మెగా మేనల్లుడు
ఈ వార్తాకథనం ఏంటి
బాలయ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షోలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ మేరకు షూటింగ్ వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. అంతేకాదు ఈ షోలో పవన్ ని బాలయ్య చాలా ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది. ముఖ్యంగా మూడు పెళ్ళిళ్ళ మీద ప్రశ్న వేసారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆ ప్రశ్నకు తనదైన రీతిలో పవన్ సమాధానం చెప్పారని, దాంతో మూడు పెళ్ళిళ్ళమీద ఎవరైనా కామెంట్ చేస్తే వారు ఊరకుక్కలతో సమానం అని బాలయ్య అన్నట్టుగా వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ ఎపిసోడ్ నుండి అప్డేట్ వచ్చింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఈ ఎపిసోడ్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్
తొడగొట్టిన సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ రాగానే, పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చెయ్యమని చెప్పాడట బాలయ్య. దాంతో పవన్ ని అనుకరించాడని అంటున్నారు. ఆ తర్వాత తొడకొట్టి బాలయ్యను ఇమిటేట్ చేసాడని సమాచారం.
ఇవేకాదు ఈ ఎపిసోడ్ లో సర్ప్రైజెస్ చాలా ఉన్నాయని అంటున్నారు. అకీరా నందన్ ని హీరోగా పరిచయం చేయడం గురించి కూడా ప్రశ్నలు వేసారట బాలయ్య.
ఈ షో నుండి వస్తున్న లీకులతో అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది. ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
మరో విషయమేంటంటే, దర్శకులు త్రివిక్రమ్, క్రిష్ లు ఈ షోలో పవన్ తో కలిసి వస్తున్నారు.
మొత్తానికి పవన్ ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తిగా ఉండనుందని అర్థం అవుతోంది.