Page Loader
అన్ స్టాపబుల్ సీజన్ 3: మొదటి ఎపిసోడ్ లో అతిథులుగా ఎవరు వస్తున్నారంటే? 
అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ లోకి వస్తున్న భగవంత్ కేసరి టీమ్

అన్ స్టాపబుల్ సీజన్ 3: మొదటి ఎపిసోడ్ లో అతిథులుగా ఎవరు వస్తున్నారంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 09, 2023
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలకృష్ణ పోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న టాక్ షో, మూడవ సీజన్ తో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లిమిటెడ్ ఎడిషన్ గా వస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 లో మొదటి ఎపిసోడ్ లో ఎవరు వస్తున్నారనేది ఆహా టీం వెల్లడి చేసింది. దసరా కంటే ముందుగానే ప్రసారమయ్యే మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం రాబోతుందని ఆహా టీం తెలియజేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ అన్ స్టాపబుల్ సీజన్ 3 ఎపిసోడ్ లో కనిపించబోతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆహా ట్వీట్