Page Loader
మైమరపించే కంగనా రనౌత్ అందం.. 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల 
మైమరపించే కంగనా రనౌత్ అందం.. 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల

మైమరపించే కంగనా రనౌత్ అందం.. 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల 

వ్రాసిన వారు Stalin
Aug 05, 2023
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ చాలా ఏళ్ల తర్వాత ఓ సౌత్ సినిమాలో నటిస్తోంది. బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ 'చద్రముఖి'కి సీక్వెల్ అయిన చంద్రముఖి 2లో ఆమె రాఘవ లారెన్స్‌తో కలిసి నటిస్తోంది. ఇదివరకే లారెన్స్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన మేకర్స్, శనివారం కంగనా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో కంగనా సాంప్రదాయక వస్త్రధారణలో చాలా అందంగా కనిపించారు. ఈ చిత్రం మొదటి భాగానికి దర్శకుడు అయిన పి.వాసు పార్-2 కూడా దర్శకత్వం వహించారు. వినాయక చవితి పండగను పురస్కరించుకొని చంద్రముఖి 2 సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రముఖి -2 ఫస్ట్ లుక్