Renu Desai: మూగ జీవాల సంరక్షణలో రేణూ దేశాయ్‌కు ఉపాసన మద్దతు
నటి రేణూ దేశాయ్ మూగ జీవాల సంరక్షణ కోసం పాటు పడుతున్న విషయం తెలిసిందే. వాటి కోసం శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అనే ఎన్జీవోను ఇటీవల ప్రారంభించారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ఈ ఎన్జీవో ఏర్పాటుతో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఈ సంస్థకు ఎవరైనా తమ వంతు సాయం చేయాలని రేణూ దేశాయ్ పిలుపునిచ్చారు. మూగ జీవాలకు అత్యవసర సేవలు అందించేందుకు రేణూ దేశాయ్ అంబులెన్స్ కొనుగోలు చేశారు. ఈ అంబులెన్స్ కొనే పనిలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కూడా ఆర్థిక సాయం అందించారు.
ఇన్‌స్టా లో కృతజ్ఞతలు తెలియజేసిన రేణూ దేశాయ్
చరణ్ పెంపుడు శునకం రైమీ పేరుతో విరాళాన్ని అందించిన ఉపాసనకు రేణూ దేశాయ్ ఇన్‌స్టా స్టోరీస్‌లో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది, ఉపాసన మంచితనాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. రేణూ దేశాయ్ మూగ జీవాల సంరక్షణ కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. చిన్ననాటి నుంచి మూగ జీవాలకు సహాయం చేయడం తన ఉద్ధేశమని, కొవిడ్ సమయంలో వాటి రక్షణ కోసం మరింత సాయం చేసేందుకు సొంతంగా ఎన్జీవోను ప్రారంభించానని ఆమె వెల్లడించారు. రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు కూడా మూగ జీవాలంటే ఎనలేని ప్రేమ ఉంది.