Ustaad Bhagat Singh OTT : ఓటీటీలో 'ఉస్తాద్ భగత్ సింగ్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఓటీటీ విడుదలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఓటీటీ రిలీజ్ ఎప్పటి నుంచి? ఈ చిత్ర డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఆ తేదీ వాయిదా పడితే, ఏప్రిల్ 24 నుంచి విడుదల చేసే అవకాశముంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
వివరాలు
నటీనటులు, సాంకేతిక బృందం
ఈ సినిమాకు హరిష్ శంకర్ దర్శకత్వం వహించగా, పవన్ సరసన రాశీ కన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. విలన్ పాత్రలో ఆర్. ప్రతిభన్ నటించగా, అశుతోష్ రాణా, నవాబ్ షా, రావు రమేష్, రంగస్థలం మహేష్, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎస్.తమన్ సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.