Vaazha2 : కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'వాల 2'.. ఆల్‌టైమ్ నంబర్ వన్ హిట్
ఈ వార్తాకథనం ఏంటి
మాలీవుడ్ చిత్ర పరిశ్రమ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం నమోదైంది. స్టార్ హీరోల మెరుపు లేకుండానే కేవలం కంటెంట్ బలం, యువ ప్రేక్షకుల మద్దతుతో వచ్చిన 'వాల 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. కేరళ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి, తాజా 'ఇండస్ట్రీ హిట్'గా అవతరించింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన 'లోక' మరియు మోహన్ లాల్ నటించిన 'తుడరుమ్' చిత్రాల రికార్డులను అధిగమిస్తూ 'వాల 2' అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ట్రేడ్ వర్గాల తాజా అంచనాల ప్రకారం, ఈ చిత్రం కేవలం 25 రోజుల్లోనే కేరళలో రూ.122-123 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల గ్రాస్ వసూళ్లు
కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.220 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2000 సంవత్సరం తర్వాత కేరళలో 80 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైన మూడవ చిత్రంగా కూడా 'వాల 2' అరుదైన ఘనతను సాధించింది. గతంలో మోహన్ లాల్ నటించిన 'నరసింహం', 'పులిమురుగన్' సినిమాలు మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్స్ హషీర్ మరియు అతని టీమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విపిన్ దాస్ కథను అందించగా, సవిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను సమానంగా ఆకట్టుకుంది.