Loading...
OTT Review: థ్రిల్లర్ లవర్స్‌కు పర్ఫెక్ట్ వీకెండ్ సిరీస్.. 8 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్.. ప్రతి సీన్ ఉత్కంఠే
థ్రిల్లర్ లవర్స్‌కు పర్ఫెక్ట్ వీకెండ్ సిరీస్.. 8 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్.. ప్రతి సీన్ ఉత్కంఠే

OTT Review: థ్రిల్లర్ లవర్స్‌కు పర్ఫెక్ట్ వీకెండ్ సిరీస్.. 8 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్.. ప్రతి సీన్ ఉత్కంఠే

వ్రాసిన వారు Moogati Shabari
Aug 23, 2026
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతివారం కొత్త కథలు, ఆసక్తికరమైన థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఇంట్లోనే హాయిగా కూర్చొని చూసేందుకు మంచి కంటెంట్ కోసం డిజిటల్ ఆడియన్స్ ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మరో ఆసక్తికరమైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ఇంతకీ ఆ సిరీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు

8 ఎపిసోడ్లతో వెబ్ సిరీస్..

2022లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'వదంతి'కి ఇప్పుడు రెండో సీజన్ వచ్చింది.

'వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి' పేరుతో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మలయాళ నటుడు ఎం. శశికుమార్ ప్రధాన పాత్రలో నటించారు.

అనఘ, అపర్ణ దాస్, యశ్వంత్ కీలక పాత్రల్లో కనిపించారు. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

వరుస ట్విస్టులు, సీట్ ఎడ్జ్ సస్పెన్స్‌తో సాగడంతో థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.

మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆద్యంతం ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తుంది.

వివరాలు

కథ ఏంటంటే..

'విక్రమ్ వేద' వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని అందించిన పుష్కర్-గాయత్రి ఈ సిరీస్‌కు క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.

తొలి సీజన్‌కు దర్శకత్వం వహించిన ఆండ్రూ లూయిస్ ఈ సీజన్‌కు కూడా రచయితగా, దర్శకుడిగా, క్రియేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

మధురైలో హైవే నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఓ అస్థిపంజరం బయటపడుతుంది. దీంతో సంచలన హత్య కేసు వెలుగులోకి వస్తుంది.

ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ మూసా రాజా (శశికుమార్).. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న మణి అనే ఖైదీని కలుస్తాడు.

అయితే మణి ప్రవర్తనతో పాటు కేసులో లభించిన కొన్ని ఆధారాలు అతడే హంతకుడా అనే అనుమానాలను కలిగిస్తాయి.

ADVERTISEMENT

వివరాలు

ట్విస్ట్ అదుర్స్..

అసలు నిజం ఏంటో తెలుసుకునేందుకు మూసా రాజా లోతుగా దర్యాప్తు ప్రారంభిస్తాడు.

ఈ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లు, మీడియా కథనాలు, ఇంతకాలం దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి.

మణి చుట్టూ దాగి ఉన్న అసలు నిజం ఏంటి? హైవే నిర్మాణ సమయంలో బయటపడిన అస్థిపంజరం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?

ఈ కేసులో నిజాన్ని వెలికితీసే క్రమంలో మూసా రాజా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో ఈ క్రైమ్ థ్రిల్లర్ ఉత్కంఠగా సాగుతుంది.

ADVERTISEMENT