NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Valentines Day: వాలంటైన్స్​ డే.. టాలీవుడ్ బెస్ట్ లవ్​ డైలాగ్స్​ మీకోసం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Valentines Day: వాలంటైన్స్​ డే.. టాలీవుడ్ బెస్ట్ లవ్​ డైలాగ్స్​ మీకోసం 
    వాలంటైన్స్​ డే.. టాలీవుడ్ బెస్ట్ లవ్​ డైలాగ్స్​ మీకోసం

    Valentines Day: వాలంటైన్స్​ డే.. టాలీవుడ్ బెస్ట్ లవ్​ డైలాగ్స్​ మీకోసం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 07, 2025
    12:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అబ్బాయి లేదా అమ్మాయి మనసును గెలుచుకోవడం అంత సులభమైన విషయం కాదు.

    మన హృదయానికి అత్యంత దగ్గరైన వ్యక్తి దగ్గర మన ప్రేమను వ్యక్తీకరించడం కూడా తేలికైన పని కాదు.

    మన భావాలను చెప్పాలంటే ధైర్యం అవసరం. ప్రేమ ఎంత అందమైనదో, దాన్ని చెప్పే తీరు కూడా అంతే అందంగా ఉండాలి.

    అందుకే మన తెలుగు చిత్రాల్లో రచయితలు ప్రేమను వ్యక్తీకరించేందుకు అద్భుతమైన మాటలను రాశారు. ఈ రోజు వాలెంటైన్స్‌ డే సందర్భంగా, వాటిలో కొన్ని మీ కోసం:

    వివరాలు 

    తెలుగు చిత్రాల్లో బెస్ట్ లవ్​ డైలాగ్స్​ ఇవే..

    వాన : ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను నేను ప్రేమించినంతగా ప్రేమించలేరు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, నన్ను మర్చిపోయినా, ముసలిదానివైపోయినా,చచ్చిపోయినా,నీ మీద నా ప్రేమ చావదు

    జాను : పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే.

    ఒక లైలా కోసం : ప్రాణం అంటూ పోవాల్సి వస్తే అది నీతోనే. లేకపోతే నా ప్రేమకు అర్థమే లేదు

    కంచె : గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం. ప్రేమిస్తే నీళ్లు పోస్తాం

    ఆరెంజ్‌: ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే..ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే,జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి.

    వివరాలు 

    తెలుగు చిత్రాల్లో బెస్ట్ లవ్​ డైలాగ్స్​ ఇవే..

    ఆర్య: నీ కోసమే నా అన్వేషణ. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం. కొన్ని వేలసార్లు మరణించైనా సరే. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను నిన్ను

    కోరి : నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే. లైఫ్‌ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది?

    మజిలీ : పెళ్లికి ముందులాగా, పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది

    మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు : కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!

    వివరాలు 

    తెలుగు చిత్రాల్లో బెస్ట్ లవ్​ డైలాగ్స్​ ఇవే..

    అందాల రాక్షసి : నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను

    ఓయ్‌ : నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే

    తీన్‌మార్‌ : మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్‌ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది.

    మనం : మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాలెంటైన్స్ డే

    తాజా

    Samantha Ruth Prabhu: దుబాయ్‌లో సమంత అందానికి ఫ్యాన్స్ ఫిదా.. గోల్డెన్ శారీలో లుక్ సూపర్బ్! సమంత
    Insomnia problem: రాత్రి నిద్రలేమి.. క్యాన్సర్ ప్రమాదం పెరుగుదలకి కారణమా? నిద్రలేమి
    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి  ఆపరేషన్‌ సిందూర్‌
    Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్‌ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ టాలీవుడ్

    వాలెంటైన్స్ డే

    NailTrends: వాలెంటైన్స్ డే కోసం అందమైన నెయిల్ ఆర్ట్ ఐడియాస్ లైఫ్-స్టైల్
    Romantic Places: మీ భాగస్వామితో వాలెంటైన్స్ డే రోజున సందర్శించాల్సిన రొమాంటిక్ ప్రదేశాలపై ఓ లుక్కేయండి! మహారాష్ట్ర
    Valentines Week Recipe: వాలెంటైన్స్ రోజున మీ భాగస్వామిని ఈ రెసిపీతో ఇంప్రెస్ చేయండి ఇలా..  లైఫ్-స్టైల్
    Valentines Week Recipe: వాలెంటైన్స్ స్పెషల్ రెసిపీ.. మినీ చాకొలెట్ కేక్స్ లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025