LOADING...
Priyanka Chopra: 'వారణాసి' షూటింగ్‌ అనుభవం అద్భుతం: ప్రియాంక చోప్రా
'వారణాసి' షూటింగ్‌ అనుభవం అద్భుతం: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: 'వారణాసి' షూటింగ్‌ అనుభవం అద్భుతం: ప్రియాంక చోప్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు హీరోగా, ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి తాజాగా నటి ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా కెన్యాలో జరిగిన షూటింగ్‌ను గుర్తుచేసుకుంటూ తన అనుభవాన్ని వివరించారు. కెన్యా అడవుల్లో వేల సంఖ్యలో వైల్డ్ బీస్ట్స్‌ (భారీ జింకలు) వలస వెళ్తున్న సమయంలో వాటి మధ్య నిలబడి షూటింగ్‌ చేయడం తన జీవితంలో మరచిపోలేని అనుభూతిగా మిగిలిందని ప్రియాంక చెప్పారు. ఆ జంతువులను అంత దగ్గరగా చూసినప్పుడు తనకు కలిగిన భావోద్వేగాన్ని ఆమె వివరించారు.

Details

ఆ అడవిలో షూటింగ్ చేయడం కొత్త అనుభూతిని ఇస్తోంది

'వాటి ముఖాలను చూస్తుంటే అవి ఎన్ని వేల ఏళ్లుగా ఈ భూమిపై జీవిస్తున్నాయో అనిపించింది. ప్రకృతి ఎంత శక్తివంతమైనదో, ఈ భూమిపై జీవపరిణామం ఎంత గొప్పదో వాటిని చూస్తే అర్థమైంది. ఆ అడవిలో షూటింగ్‌ చేయడం నిజంగా ఒక అద్భుత అనుభూతి అని ప్రియాంక తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో కెన్యాలో జరిగింది. అక్కడ జరిగిన షూటింగ్‌ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివని దర్శకుడు రాజమౌళి కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Details

ఆస్కార్‌ ప్రజెంటర్‌గా ప్రియాంక

ఇదిలా ఉండగా, నటి ప్రియాంక చోప్రా తాజాగా మరో గొప్ప గౌరవాన్ని అందుకున్నారు. మార్చి 15న జరిగే అకాడమీ అవార్డులు వేడుకల్లో ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. హాలీవుడ్‌ ప్రముఖులతో కలిసి ఒక విభాగంలో విజేతకు అవార్డు అందించనున్నారు. ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కార్యక్రమంలో కూడా ఆమె ప్రజెంటర్‌గా పాల్గొన్నారు. ఇప్పుడు ఆస్కార్‌ ప్రజెంటర్ల జాబితాలో చోటు దక్కడంతో ఆమెకు సినీ పరిశ్రమతో పాటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement