వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఫిక్స్? జూన్ 9న అంగరంగ వైభవంగా!
ఈ వార్తాకథనం ఏంటి
త్వరలో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. హీరో వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకులకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మెగా ఫ్యామిలీ సిద్ధమైందట. ఏకంగా ఎంగేజ్మెంట్ వేడుకకు మూహుర్తం ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
హీరో వరుణ్ తేజ్ తన రూమార్డ్ గర్లఫ్రెండ్ లావణ్య త్రిపాఠితో ఏడు ఏడడుగులు వేయడటానికి సిద్ధమయ్యారట. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ మీడియా పింక్ విల్లా కథనం ప్రకారం జూన్ 9న లావణ్యతో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగనుందట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలైనట్లు తెలుస్తోంది.
ఈ వేడుకులకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానున్నారట. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే నిశ్చితార్థం వేడుకకు అహ్వానం ఉన్నట్లు సమాచారం.
Details
హాలిడ్ ట్రిప్ ముగిసిన వెంటనే ఎంగేజ్మెంట్?
హైదరాబాద్ లోని నివాసంలో లేదా ఓ ఫంక్షన్ హాలులో వీరి నిశ్చితార్థ వేడక జరగనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే వీరి వివాహం కూడా ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ హాలిడ్ ట్రిప్ కు వెళ్లారట. ఇటలీలోని రోమ్ లో ఉన్నట్లు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
లావణ్య కూడా ట్రావెలింగ్ చేస్తున్నట్లు ఈ మధ్యనే పోస్టు చేసింది. దీంతో ప్రస్తుతం ఈ జంట హాలిడే ట్రిప్ లో ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు.
ట్రిప్ నుంచి వచ్చిన వెంటనే ఎంగేజ్మెంట్ గురించి అధికారికంగా ప్రకటన వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగబాబు త్వరలోనే వరుణ పెళ్లి ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.