Loading...
Maruthi: మారుతితో వరుణ్ తేజ్ సినిమా..? వైరల్ వార్తలపై షాకింగ్ ట్విస్ట్!
మారుతితో వరుణ్ తేజ్ సినిమా..? వైరల్ వార్తలపై షాకింగ్ ట్విస్ట్!

Maruthi: మారుతితో వరుణ్ తేజ్ సినిమా..? వైరల్ వార్తలపై షాకింగ్ ట్విస్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

'రాజాసాబ్' ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో దర్శకుడు 'మారుతి' తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పలువురు స్టార్ హీరోలతో ఆయన సినిమా చేయనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, వాటిలో ఏదీ ఇప్పటివరకు అధికారికంగా ఖరారు కాలేదు. 'రాజాసాబ్' ఫలితం ప్రభావంతో కొందరు హీరోలు మారుతితో సినిమా చేసేందుకు వెనుకంజ వేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్' హీరోగా మారుతి ఓ రీజనబుల్ బడ్జెట్‌తో కొత్త కథను తెరకెక్కించనున్నారని ఇటీవల సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ కాంబినేషన్ నిజమా కాదా అన్న చర్చ జోరందుకుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' విడుదలకు సిద్ధమవుతోంది.

వివరాలు

ఆగస్టు 7న రిలీజ్

ఈ సినిమా తర్వాత ఆయన తన సోదరి 'నిహారిక' నిర్మిస్తున్న 'బరి' చిత్రంలో నటించనున్నారు.

ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం మారుతి-వరుణ్ తేజ్ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశముందని ప్రచారం జరిగింది.

అయితే ఈ వార్తలపై వరుణ్ తేజ్ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.

మారుతి-వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో సినిమా వస్తోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎలాంటి నిజం లేదని వారు తేల్చిచెప్పారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఆగస్టు 7న కొరియన్ కనకరాజు చిత్రం విడుదలైన తర్వాత కొంత విరామం తీసుకుని, అనంతరం 'బరి' సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.

ADVERTISEMENT