
Jayathi :డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి ఆల్బమ్‌తో అభిమానుల మనుస్సు దోచిన వెన్నెల జయతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రేక్షకులకు జయతి పేరు ఇప్పట్లో గుర్తిండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆమె జెమినీ మ్యూజిక్‌లో ప్రసారం అయిన వెన్నెల షో ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నది.
ఆ షోలో వీడియో జాకీగా అలరించిన జయతి, తన ముద్రను ప్రేక్షకులపై వేసింది. ఆమెను ఆంధ్ర మాధురి దీక్షిత్ అనేవారు. ఎందుకంటే ఆమె డ్యాన్స్ స్టైల్, వ్యక్తిత్వం ప్రేక్షకులను ఎంతో ఆకర్షించేవి.
వీడియో జాకీగా తన కెరీర్ ప్రారంభించిన తర్వాత, జయతి సినిమాల్లోకి కూడా అడుగు పెట్టింది.
తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా 'లచ్చి' అనే హారర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది, అలాగే హీరోయిన్‌గా కూడా నటించింది.
Details
ఆల్బమ్ సాంగ్స్ తో సత్తా చాటుతున్న జయతి
ఆ తరువాత కొన్ని సంవత్సరాలు విరామం తీసుకున్న జయతి, ఇప్పుడు మళ్లీ నటనలోకి వచ్చి, ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ తన ప్రతిభను నిరూపిస్తోంది.
ఇటీవల విడుదలైన 'డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి' అనే ఆల్బమ్ సాంగ్‌తో ఆమె ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ఈ పాట యూట్యూబ్‌లో నివృతి వైబ్స్ ఛానల్ ద్వారా విడుదలై, చాలా పాప్యులర్ అయింది. ప్రస్తుతం ఈ పాట 2 మిలియన్ వ్యూస్ దాటింది.
పెళ్లి నేపథ్యంతో సాగుతున్న ఈ ఫోక్ సాంగ్‌లో జయతి తన ప్రత్యేకమైన డాన్స్ స్టైల్‌తో ప్రేక్షకులను అలరించింది.