Sasivadane : 'శశివదనే' సినిమా నుంచి 'వెతికా నిన్నిలా' మెలోడీ సాంగ్ రిలీజ్..
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న అందమైన ప్రేమకథ 'శశివదనే'. సాయి మోహన్ ఉబ్బర రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ అండ్ సాంగ్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేసారు. 'వెతికా నిన్నిలా' అంటూ సాగే మెలోడీ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ ప్రేమ కథని గోదావరి నేపథ్యంలో అందంగా చూపించబోతున్నారు. కిట్టు విస్సాప్రగడ రాసిన అందమైన సాహిత్యానికి శరవణ వాసుదేవన్ సంగీతం సమకూర్చగా సత్య యామిన్ పాడారు.
కోనసీమలో 50 రోజుల పాటు చిత్రీకరణ
ఈ పాటను కోమలీ ప్రసాద్ పై చిత్రీకరించారు గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాటోగ్రఫీని శ్రీ సాయికుమార్ దారా, ఎడిటింగ్ గ్యారీ బిహెచ్ నిర్వహిస్తున్నారు. శశివదనే చిత్రాన్ని కోనసీమలోని అద్భుతమైన, సుందరమైన ప్రదేశాలలో 50 రోజుల పాటు చిత్రీకరించారు. ప్రధాన నటుడు రక్షిత్ చివరిసారిగా పలాస 1978లో కనిపించారు. ప్రస్తుతం WHO, ఆపరేషన్ రావణ్ అనే మరో రెండు చిత్రాలను కూడా చేస్తున్నారు.