LOADING...
Nayanthara: నయన్‌ బర్త్‌డే..  ఖరీదైన బహుమతి ఇచ్చిన  విఘ్నేశ్‌.. ఎన్ని రూ.కోట్లంటే! 
నయన్‌ బర్త్‌డే.. ఖరీదైన బహుమతి ఇచ్చిన విఘ్నేశ్‌.. ఎన్ని రూ.కోట్లంటే!

Nayanthara: నయన్‌ బర్త్‌డే..  ఖరీదైన బహుమతి ఇచ్చిన  విఘ్నేశ్‌.. ఎన్ని రూ.కోట్లంటే! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

చలనచిత్ర రంగంలో అత్యంత అందమైన జంటల్లో నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ పేర్లు ఎప్పుడూ ముందుంటాయి. అవకాశం దొరికినప్పుడల్లా ఇద్దరూ ఒకరిపై ఒకరు చూపించే ప్రేమను అభిమానులు ఎన్నోసార్లు చూశారు. నవంబర్‌ 19తో నయనతార (Nayanthara) తన 41వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత గుర్తుండేలా చేయాలని భావించిన ఆమె భర్త విఘ్నేశ్‌ శివన్‌(Vignesh Shivan) మరోసారి ఖరీదైన గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ చేశారు. ప్రతి ఏడాది విలాసవంతమైన కార్లను భార్యకు అందించే విఘ్నేశ్‌,ఈసారి కూడా ఆ పద్ధతినే కొనసాగించారు. రోల్స్‌ రాయిస్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ స్పెక్టర్‌ మోడల్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చి తన శుభాకాంక్షలు తెలిపారు.ఈ లగ్జరీ వాహనం మార్కెట్‌ ధర సుమారు రూ.10కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

వివరాలు 

గతంలో కూడా విఘ్నేశ్‌ నయన్‌కు ఖరీదైన గిఫ్ట్స్ 

ఇక గతంలో కూడా విఘ్నేశ్‌ నయన్‌కు ఖరీదైన కార్లే అందించారు. 2023లో మెర్సిడెస్‌ మేబ్యాక్‌ కారును బహుమతిగా ఇచ్చారు, దీని విలువ దాదాపు రూ.3 కోట్లు. 2024కి వచ్చేసరికి మెర్సిడెస్‌ బెంజ్‌ మేబ్యాక్‌ జీఎల్ఎస్‌ 600ను అందించి అందరి దృష్టిని ఆకర్షించారు; ఆ కారు విలువ సుమారు రూ.5 కోట్లు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది మాత్రం గత రికార్డుల్ని మించి, దాదాపు రూ.10 కోట్ల విలువైన గిఫ్ట్‌తో భార్యను ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ జంట కొత్త కారుతో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో భారీగా వైరల్‌ అవుతున్నాయి.