LOADING...
Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ కాదు నేను గేమింగ్‌ యాప్‌నే ప్రమోట్‌ చేశా: విజయ్‌ దేవరకొండ
బెట్టింగ్ యాప్ కాదు నేను గేమింగ్‌ యాప్‌నే ప్రమోట్‌ చేశా: విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ కాదు నేను గేమింగ్‌ యాప్‌నే ప్రమోట్‌ చేశా: విజయ్‌ దేవరకొండ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాను కేవలం గేమింగ్ యాప్‌నే ప్రమోట్ చేశానని, గేమింగ్‌ యాప్స్‌కు, బెట్టింగ్‌ యాప్స్‌కు తేడా ఉందన్నారు నటుడు విజయ్ దేవరకొండ . దాదాపు నాలుగున్నర గంటలపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "బెట్టింగ్ యాప్ కేసులో నా పేరును ప్రస్తావించిన నేపథ్యంలోనే నన్ను విచారణకు పిలిచారు. భారత్‌లో రెండు రకాల యాప్‌లు ఉన్నాయి. ఒకవైపు బెట్టింగ్ యాప్‌లు, మరోవైపు గేమింగ్ యాప్‌లు. నేను ప్రమోట్ చేసినది A23 అనే గేమింగ్ యాప్ మాత్రమేనని స్పష్టంగా చెప్పాను. గేమింగ్ యాప్‌లకు, బెట్టింగ్ యాప్‌లకు ఎలాంటి సంబంధమూ ఉండదని ఈడీకి వివరించాను" అని ఆయన చెప్పారు.

వివరాలు 

A23 గేమింగ్ యాప్ తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో లేదు

"గేమింగ్ యాప్‌లు అనేక రాష్ట్రాల్లో చట్టబద్ధంగానే ఉన్నాయి. వీటికి సంబంధించి జీఎస్టీ, పన్నులు, అవసరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్లు అన్నీ ఉంటాయి. నా బ్యాంకు ఖాతా లావాదేవీలన్నింటినీ కూడా ఈడీ అధికారులకు సమర్పించాను" అని విజయ్ వివరించారు. "నేను ప్రమోట్ చేసిన A23 గేమింగ్ యాప్ తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో లేదు. నేను చట్టబద్ధమైన గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రచారం చేశాను. ఈ కంపెనీతో నేను కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈడీకి ఇచ్చాను" అని వెల్లడించారు.