Page Loader
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ డెడికేషన్‌.. కేవలం రెండు కాళ్లపై బ్యాలెన్స్ చేస్తూ గోడ ఎక్కిన రౌడీ హీరో..!
విజయ్‌ దేవరకొండ డెడికేషన్‌.. కేవలం రెండు కాళ్లపై బ్యాలెన్స్ చేస్తూ గోడ ఎక్కిన రౌడీ హీరో..!

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ డెడికేషన్‌.. కేవలం రెండు కాళ్లపై బ్యాలెన్స్ చేస్తూ గోడ ఎక్కిన రౌడీ హీరో..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

రౌడీ హీరోగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్నా కూడా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సినిమా విజయం సాధించకపోయినా ప్రతి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో విజయ్ దేవరకొండ తన ప్రత్యేకతను కొనసాగిస్తున్నాడు. 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'లైగర్', 'ఖుషీ', 'ఫ్యామిలీ స్టార్' వంటి సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచిన తరువాత ఇప్పుడు 'కింగ్‌డమ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ దేవరకొండ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ 'కింగ్‌డమ్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల జూలై 31న విడుదల కానుంది.

వివరాలు 

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విజయ్ దేవరకొండ

'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విజయ్‌కు చాలా కాలంగా సరైన హిట్ రాకపోవడంతో,ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా,విజయ్ దేవరకొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం,తీవ్ర నీరసం కారణంగా హాస్పిటల్‌కి వెళ్లిన విజయ్‌కు వైద్యులు డెంగ్యూ ఉందని నిర్ధారించినట్టు తెలుస్తోంది. కనీసం మూడు రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్టు సమాచారం.

వివరాలు 

'ఇదీ మా హీరో డెడికేషన్‌'

అయితే ఈ వార్తలపై విజయ్ కుటుంబ సభ్యుల నుంచి గానీ, ఆయన టీమ్ నుంచి గానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు విజయ్ ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇదీ మా హీరో డెడికేషన్‌' అంటూ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ ఒక సందులో కేవలం రెండు కాళ్లపై బ్యాలెన్స్ చేస్తూ గోడపైకి అలవోకగా ఎక్కేస్తున్నాడు. విజయ్ డెడికేషన్ చూసిన ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ వీడియో