Vijay Devarkonda: విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు ప్రసారం.. ఆపై పోలీసులు, కంప్లైంట్, అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయాణం ఆరంభించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు.
తన సినీప్రయాణంలో ఎన్నోమెట్లు ఎక్కుతూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ అంశంలో ఓ యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు.
దేవరకొండపై అసభ్యకరమైన వార్తలు ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొన్ని రోజుల క్రితం సదరు వ్యక్తి సినిమాలకు సంబంధించి అసభ్యకర వార్తలను ప్రసారం చేశారు. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విజయ్'ను అవమానిస్తూ ప్రసారం చేశాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురానికి చెందిన వెంకటకిరణ్ అనే వ్యక్తి విజయ్ దేవరకొండ గౌరవాన్ని కించపరిచేలా అసత్య కథనాలను ప్రసారం చేశారు.
DETAILS
యూట్యూబర్ వెంకట్ కిరణ్ అరెస్ట్, పోలీసుల వార్నింగ్
ఈ మేరకు ఆయన సినిమాల్లోని హీరోయిన్లలను అవమానిస్తూ చేసిన యూట్యూబ్ వీడియోలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో వెంటనే స్పందించిన పోలీసులు సదరు వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నారు.
కేసు నెంబర్ : 2590/2023గా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలోనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అనంతరం వెంకట కిరణ్'కు కౌన్సిలింగ్ ఇచ్చారు. యూట్యూబ్'లో పెట్టిన సదరు వీడియోలను ఛానల్'ని పోలీసులు డిలీట్ చేయించారు.
భవిష్యత్'లోనూ ఇటువంటివి చేయకుండా ఉండాలని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి పనులు ఎవరు చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.