
Kingdom Collections : కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'.. మూడ్రోజుల్లో ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'కింగ్డమ్' జూలై 31న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్‌తో విజయపథంలో దూసుకెళుతోంది. ప్రేక్షకుల నుంచి బాగా ఆదరణ లభించడంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. రిలీజ్ రోజు రెండవ రోజు కలిపి మొత్తం రూ.53 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తాజాగా మూవీ యూనిట్ ప్రకటించిన సమాచారం ప్రకారం, ఈ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.67 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇది అధికారికంగా వెల్లడించిన సమాచారం కావడం విశేషం.
Details
ఇవాళ కలెక్షన్స్ పెరిగే అవకాశం
ఇక ఈ సినిమాకు రూ.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ.110 కోట్ల గ్రాస్ వసూలు కావాల్సి ఉంటుంది. నేడు ఆదివారం కావడంతో కలెక్షన్ల పరంగా ఇంకా మంచి ఊపుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు వచ్చే వారం విడుదలకు పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల 'కింగ్డమ్'కి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ వేగం కొనసాగితే సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తోంది.