Vijay Deverakonda: వరుస సినిమాలతో మూడు నెలలు ప్రేక్షకుల ముందే ఉంటా: విజయ్ దేవరకొండ
ఈ వార్తాకథనం ఏంటి
వరుస సినిమాలతో మూడు నెలల పాటు ప్రేక్షకులను పలకరించనున్నట్లు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తెలిపారు. తన సోదరుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ''సెప్టెంబర్ 11న ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అక్టోబర్ 16న నా సినిమా విడుదల కానుంది. నవంబర్‌లో దేవరకొండ-రష్మిక సినిమా కూడా రాబోతోంది. ఇలా వరుస సినిమాలతో అభిమానులను నాన్‌స్టాప్‌గా కలుస్తూనే ఉంటా. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న సెట్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాను. 'రణబాలి' విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఇక్కడ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుని మళ్లీ సెట్‌కు వెళ్లాలి'' అని విజయ్ చెప్పారు.
వివరాలు
ఆ భయంతోనే విగ్గు కూడా తీయకుండా వచ్చేశా..
ఇటీవల సినిమాలు ఆలస్యమవుతున్న విషయంపై అభిమానులు, ప్రేక్షకులు గట్టిగా విమర్శిస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.
''ఈ మధ్య సినిమాలు లేటవుతున్నాయని గట్టిగా తిడుతున్నారు. ఆ భయంతోనే విగ్గు కూడా తీయకుండా వచ్చేశా.
నిజానికి షూటింగ్‌లో వేసుకున్న బట్టలతోనే కార్యక్రమానికి వచ్చేయాలని అనుకున్నా.
అలా వస్తే మళ్లీ 'రణబాలి' ప్రమోషన్ కోసం వచ్చాడని అనుకుంటారేమోనని, ఎలాగోలా త్వరగా దుస్తులు మార్చుకుని వచ్చా'' అని నవ్వుతూ తెలిపారు.
తెలుగు సినిమాకు ఇది సూపర్ ఇయర్ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయని, ప్రేక్షకులు వాటిని ఆదరిస్తుండటంతో చిత్రాలు విజయవంతమవుతున్నాయని అన్నారు.
సెప్టెంబర్ 11న 'ఎపిక్' విడుదలైన తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన 'ది ప్యారడైజ్' రానుందని చెప్పారు.
వివరాలు
ఈ ఏడాది ముగింపు చాలా సాలిడ్‌గా ఉండబోతోంది: విజయ్ దేవరకొండ
ఆ తర్వాత తన 'రణబాలి' ప్రేక్షకుల ముందుకు వస్తుందని, అనంతరం రష్మిక నటించిన 'మైసా' విడుదల కానుందని తెలిపారు.
తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన 'ఈనగరానికి ఏమైంది 2', డిసెంబర్‌లో 'ఫౌజీ', బాలయ్య నటిస్తున్న 'దాదా' చిత్రాలు కూడా రానున్నాయని విజయ్ వెల్లడించారు.
''ఈ ఏడాది ముగింపు చాలా సాలిడ్‌గా ఉండబోతోంది. ఈ సినిమాల్లో నాలుగు చిత్రాల కంటెంట్ నాకు తెలుసు. వాటి గ్లింప్స్ కూడా చూశాను. ఈ సినిమాలకు వంద శాతం స్ట్రయిక్ రేట్ వస్తుందని భావిస్తున్నాను'' అని విజయ్ దేవరకొండ ధీమా వ్యక్తం చేశారు.