Page Loader
Thangalaan Teaser : తంగలాన్ టీజర్ రిలీజ్.. విక్రమ్ ఉగ్రరూపం చూస్తే అంతే మరి
Thangalaan Teaser : తంగలాన్ టీజర్ రిలీజ్..

Thangalaan Teaser : తంగలాన్ టీజర్ రిలీజ్.. విక్రమ్ ఉగ్రరూపం చూస్తే అంతే మరి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 01, 2023
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొత్త సినిమా తంగలాన్ టీజర్ విడుదలైంది. ఈ మేరకు త్వరలోనే థియేటర్లో ప్రేక్షకులను అలరించనున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్, పార్వతి, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు. వందలాది సంవత్సరాల క్రితం జరిగిన ఓ యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదే సమయంలో కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారని తెలుస్తోంది. గతంలోనే ఈ సినిమా నుంచి వచ్చిన విక్రమ్ స్టిల్, మేకింగ్ వీడియోలు చూసి ప్రేక్షకుల్లో భారీగా ఉత్కంఠ పెరిగింది.

details

గోల్డ్ మైన్స్ గ్రామాల్లోని ప్రజలకు, ఆంగ్లేయులకు యుద్ధం నేపథ్యంలోనే తంగలాన్

తాజాగా తంగలాన్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. గోల్డ్ మైన్స్ (బంగారు గనులు) వద్ద ఉండే గ్రామాల్లోని భారతీయులు, ఆంగ్లేయులకు మధ్య జరిగిన యుద్ధ సన్నివేశాలను ఇందులో ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగానే ఈ టీజర్ లో విక్రమ్ రౌద్రరూపంలో ఉన్న స్టిల్ ను విడుదల చేశారు. కత్తి పట్టుకుని అందర్నీ నరికేస్తూ, ఓ సీన్ లో చేత్తోనే పాముని రెండు ముక్కలుగా చేసి పడేస్తున్నట్లుగా చూపించడం గమనార్హం. తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఊహకు అందకుండా విక్రమ్ స్టిల్స్ ఉన్నాయి. దీంతో తంగలాన్ సినిమా సరికొత్తగా కనిపించనుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు జనవరి 26న పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రిలీజ్ చేయనున్నామని చిత్ర నిర్మాణ బృందం ప్రకటన చేసింది.