Dolly Dhanunjay: వివాహ బంధంలోకి 'పుష్ప-2' విలన్.. పెళ్లి తేదీ, ప్రదేశం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో అనేక మంది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతూ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతున్నారు.
ఇదే జాబితాలో ఇప్పుడు 'పుష్ప-2: ది రూల్' సినిమాతో వెలుగులోకి వచ్చిన డాలీ ధనుంజయ్ కూడా చేరనున్నాడు.
'పుష్ప 2'లో జాలిరెడ్డి పాత్రలో నటించి తన విలనిజంతో అందరి దృష్టిని ఆకర్షించిన ధనుంజయ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు.
ఆయన ధన్యత అనే అమ్మాయిని ప్రేమలో ఉండగా, కొంతకాలంగా కలిసి ఉన్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం జరుపుకున్నారు.
ఇక వీరి వివాహం ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఘనంగా జరగనుంది. ఈ విషయాన్ని ధనుంజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
Details
మైసూర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వివాహం
తన క్లాప్‌బోర్డ్ పట్టుకుని ఉన్న ఫొటోతో పాటు, తన కాబోయే భార్య డాక్టర్ ధన్యత చేతిలో స్టెతస్కోప్ పట్టుకున్న ఫొటోలను షేర్ చేశాడు.
ఈ వేడుక మైసూర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగనుందని సమాచారం. చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్న కారణంగా అదే ప్రదేశాన్ని పెళ్లి కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
పెళ్లి ఏర్పాట్లు మాత చాముండేశ్వరి అనుగ్రహంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ధనుంజయ్ కాబోయే జీవితసఖి ధన్యత చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన గైనకాలజీ స్పెషలిస్ట్ అని తెలుస్తోంది.
వీరిద్దరి మధ్య అనుబంధం చాలా కాలంగా కొనసాగుతుండగా, అది ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటికానున్నారు.