Virosh: 'విరోష్' ప్రీమియర్ లీగ్.. వినూత్నంగా పెళ్లి తేదీ వెల్లడించిన విజయ్
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు ఈ తేదీని తాజాగా అధికారికంగా వెల్లడించారు. నిన్న మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు సమాచారం. సంగీత్ కార్యక్రమం సందర్భంగా వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాల ఫొటోలు, వారి ప్రేమ ప్రయాణాన్ని ప్రతిబింబించే ఫ్రేమ్‌లతో వేదికను అలంకరించారు. ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి (Wedding of Virosh). ఆ ఫొటోలను అధికారికంగా విడుదల చేయాలని అభిమానులు సోషల్ మీడియాలో వీరిని ట్యాగ్ చేస్తూ కోరుతున్నారు.
వివరాలు
క్రికెట్ బ్యాట్,వెండి పతకంపై 'ఫిబ్రవరి 26'
సంగీత్ కార్యక్రమంలో భాగంగా ఇరు కుటుంబాలు కలిసి సరదాగా 'విరోష్ ప్రీమియర్ లీగ్' పేరుతో ప్రత్యేక వేడుకను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. క్రికెట్ బ్యాట్,వెండి పతకంపై 'ఫిబ్రవరి 26' అని నమోదు చేయడం ద్వారా పెళ్లి తేదీని వినూత్నంగా ప్రకటించారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు హల్దీ వేడుక జరగనుంది.ఉదయ్‌పూర్‌లోని మెమెంటోస్ హోటల్‌లో ఈ వివాహం జరగనుండగా,సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు పలువురు వ్యాపారవేత్తలు కూడా హాజరుకానున్నారు. దీంతో ఉదయ్‌పూర్ విమానాశ్రయం అతిథులతో సందడిగా మారింది. తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, ఈషా, శ్రావ్యా వర్మ, ఆషిక రంగనాథ్, అనిల్ అంబానీ తదితర ప్రముఖులు ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సంగీత్‌లో ప్రేమ ఫ్రేమ్‌లు… వైరల్ అవుతున్న వీడియోలు
We need those original pictures @iamRashmika please 🥹❤️❤️#ViRosh pic.twitter.com/uVx2O2gWLz
— Rahul (@The_pathbreaker) February 24, 2026