Page Loader
Kannappa: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'కన్నప్ప' టీజర్‌ను విడుదల చేయనున్న మంచన్న
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'కన్నప్ప' టీజర్‌ను విడుదల చేయనున్న మంచన్న

Kannappa: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'కన్నప్ప' టీజర్‌ను విడుదల చేయనున్న మంచన్న

వ్రాసిన వారు Stalin
May 13, 2024
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా టీజర్‌ను మే 20న ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. 'కన్నప్ప' సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫాంటసీ డ్రామాలో భారతదేశంలోని వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్ర తారలు అతిధి పాత్రలు పోషించారు.

Details 

సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన కల్పించడం మా లక్ష్యం

మే 20న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో 'కన్నప్ప' టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. "ప్రపంచ ప్రేక్షకులకు మా పాపులర్ కన్నప్పను ప్రదర్శించడానికి కేన్స్ అనువైన వేదిక. మన భారతీయ కథను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం.. ప్రపంచ ప్రేక్షకులకు మన కథలు., సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన కల్పించడం మా లక్ష్యం " అని ఆయన అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్ 

Details 

ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం

ఈ చిత్రానికి కథను పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ సంయుక్తంగా రాశారు. ఇంతకుముందు, కృతి సనన్ సోదరి, నూపుర్ సనన్, మహిళా కథానాయికగా ఎంపికైంది. అనివార్య కారణాల వల్ల , ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఈ చిత్రంలో విష్ణు మంచు, మోహన్ బాబు, అక్షయ్ కుమార్‌లతో పాటు ప్రభాస్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, మధు, శరత్‌కుమార్, ప్రభుదేవా, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, కౌశల్ మందా కీలక పాత్రలలో నటిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు.