Raaka :అవతార్‌ను మించిన విజువల్స్.. 'రాకా'పై శిబి చక్రవర్తి ఆసక్తికర కామెంట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల్లో 'రాకా' (Raaka) ఒకటి. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గత కొన్ని రోజులుగా వరుస అప్‌డేట్లతో ట్రెండ్ అవుతోంది. తాజాగా తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి (Cibi Chakravarthy) ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. చిత్రరంగంలో విజువల్ వండర్ అనగానే గుర్తొచ్చే 'అవతార్' (Avatar) సినిమాలోని విజువల్స్‌ను మించి 'రాకా'లోని కొన్ని సన్నివేశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ''భారతీయ సినీరంగానికి గర్వకారణంగా నిలిచే సినిమాను అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఆయన నాకు సినిమాలోని విజువల్స్ చూపించారు. నేను 'అవతార్'లో కూడా అంత గొప్ప విజువల్స్ చూడలేదు.
వివరాలు
'అద్భుతం' అనే పదం కూడా సరిపోదు
వాటిని వర్ణించడానికి 'అద్భుతం' అనే పదం కూడా సరిపోదు. మరో రెండు, మూడు రోజుల్లో మీరందరూ వాటిని చూస్తారు.
రాజమౌళి భారతీయ సినిమాను ఎలా తదుపరి స్థాయికి తీసుకువెళ్తున్నారో.. అట్లీ కూడా 'రాకా'తో మన ఇండస్ట్రీని ప్రపంచం ముందు మరింత ఎత్తులో నిలబెడతారు. ఆయన శిష్యుడిని అయినందుకు నేను గర్వపడుతున్నానని శిబి చక్రవర్తి అన్నారు.
ఇక గత కొన్ని రోజులుగా 'రాకా' చిత్రబృందం వరుస పోస్టులతో అభిమానుల్లో జోష్ నింపుతోంది.
రెండు రోజుల క్రితం '37' అని రాసి ఉన్న పోస్టర్‌ను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా ఓ వీడియోను కూడా షేర్ చేసింది.
వివరాలు
త్వరలోనే 'రాకా' గ్లింప్స్
''పరిమితులు దాటి ఆలోచించాం.. లక్ష్యాలను సాధించేందుకు ధైర్యంగా ముందడుగు వేశాం.. ఊహించిన దానికంటే ఎంతో ఎత్తుకు వెళ్లాం'' అని ఆ వీడియోలో పేర్కొంది.
దీంతో త్వరలోనే 'రాకా' గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం హింట్ ఇచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరలవుతున్న వీడియో ఇదే
Get ready to witness a global triumph! ✨ #Raaka pic.twitter.com/IWAskqz7Lw
— Sun Pictures (@sunpictures) September 18, 2026