LOADING...
Prabhas: వరుస సినిమాలతో బిజీ బిజీగా రెబల్ స్టార్..ప్రశంసలు కురిపించిన వివేక్ ఒబెరాయ్
వరుస సినిమాలతో బిజీ బిజీగా రెబల్ స్టార్..ప్రశంసలు కురిపించిన వివేక్ ఒబెరాయ్

Prabhas: వరుస సినిమాలతో బిజీ బిజీగా రెబల్ స్టార్..ప్రశంసలు కురిపించిన వివేక్ ఒబెరాయ్

వ్రాసిన వారు Moogati Shabari
May 22, 2026
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన రెండు భారీ ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్‌', అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు.

వివరాలు

స్పిరిట్‌లో కీలక పాత్ర..

ప్రభాస్‌ పని తీరు తనకు ఎంతో నచ్చుతుందని వివేక్ ఒబెరాయ్ తెలిపారు. ''ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా ప్రభాస్‌ ఎంతో కష్టపడి తన పని పూర్తి చేస్తున్నారు. మౌనంగా తన పని తాను చేసుకునే స్వభావం ఆయనది. అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ అందరితో కలిసిపోతారు. ఎక్కడా స్టార్‌డమ్ చూపించరు. గర్వం కూడా ఉండదు. ముఖ్యంగా షూటింగ్ లొకేషన్‌కు ఆయన తీసుకువచ్చే రుచికరమైన వంటల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ ఎంతోమందికి స్ఫూర్తి'' అని పేర్కొన్నారు. 'స్పిరిట్‌' సినిమాలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

వివరాలు

లుక్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు..

ఇక మరోవైపు పెరుగుతున్న ఎండలను కూడా లెక్క చేయకుండా ప్రభాస్ తన రాబోయే సినిమాల షూటింగ్‌లను వేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. రెండు చిత్రాల పనులను ఒకేసారి సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారట. షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం కాకుండా ఉండేందుకు ఒక లొకేషన్ నుంచి మరో లొకేషన్‌కు వెళ్తూ డేట్స్‌ను స్వయంగా మేనేజ్ చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు సినిమాల కథాంశాలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో లుక్స్ విషయంలో కూడా ప్రభాస్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement