
వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో వస్తున్న సినిమా నుండి సరికొత్త అప్డేట్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా హీరో వరుణ్ తేజ్ సరికొత్త అప్డేట్ తో ముందుకు వచ్చాడు. గత ఏడాది గని సినిమాతో అపజయం అందుకుని, ఆ తర్వాత ఎఫ్ 3 సినిమాతో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
తాజాగా సరికొత్త సినిమాతో ముందుకు వస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. తన కెరీర్లో 12వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ని ఈ నెల 19వ తేదీన రివీల్ చేయనున్నారు.
ఈ మేరకు వరుణ్ తేజ్, చిత్ర నిర్మాణ సంస్థ ఎస్వీసీసీ, ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. అందులో వరుణ్ తేజ్ ఒక చేతిలో గన్ పట్టుకుని ఒకవైపు చూస్తూ నిలబడ్డాడు.
వరుణ్ తేజ్
నాగార్జునకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన వరుణ్ తేజ్
పోస్టర్ బ్యాగ్రౌండ్ ని పరిశీలిస్తే ముంబైలోని ప్రసిద్ధి చెందిన ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ లాగా అనిపిస్తోంది. దాంతో ఇదేదో మాఫియాకు సంబంధించిన కథ అయ్యుండవచ్చని అనుకుంటున్నారు.
నాగార్జునతో ఘోస్ట్ సినిమా తీసి డిజాస్టర్ అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఈ సినిమాకు దర్శకత్వం చేస్తున్నారు.
ఘోస్ట్ మూవీ డిజాస్టర్ అయ్యింది కానీ అంతకుముందు ప్రవీణ్ తీసిన గుంటూర్ టాకీస్, గరుడవేగ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.
ప్రస్తుతానికి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియదు. ఫస్ట్ లుక్ తో పాటు ఆ వివరాలు వెల్లడిస్తారో లేదో చూడాలి.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సరికొత్త అప్డేట్ తో వస్తున్న వరుణ్ తేజ్
#VT12 pic.twitter.com/TFyloxOww9
— Varun Tej Konidela (@IAmVarunTej) January 17, 2023