
వాలేరు వీరయ్య: రిలీజ్ కి ముందు క్రేజీ సాంగ్ రిలీజ్, శృతి అందాలు అదరహో
ఈ వార్తాకథనం ఏంటి
వాల్తేరు వీరయ్య సినిమా నుండి క్రేజీ సాంగ్ బయటకు వచ్చింది. నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువా అంటూ సాగే పాట ఆద్యంతం అద్భుతంగా ఉంది.
ఈ సాంగ్ తాలూకు మేకింగ్ వీడియోని సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్ చేసినపుడు, అందరూ ఈ సాంగ్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూసారు.
మొత్తానికి పాటను రిలీజ్ చేసారు. పాట మొదలు కావడమే చాలా ఆసక్తిగా మొదలైంది. వయ్యారంగా నడుచుకొచ్చేత్తాందే, గుండెల్లోనా వణుకు పుట్టేత్తాందే అని ఒక రకమైన యాసలో హీరోయిన్ గురించి పాడటం, దానికి సమాధానంగా చిరంజీవి గొంతు కలపడం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
దేవిశ్రీ అందించిన మ్యూజిక్, రామజోగయ్య సాహిత్యం చాలా చక్కగా కుదిరింది.
వాల్తేరు వీరయ్య
చిరంజీవి స్టెప్పులు, శృతి అందం ప్రత్యేక ఆకర్షణ
అదిరిపోయే బీట్ కి మెగాస్టార్ చిరంజివి స్టెప్పులు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. శృతి హాసన్ చాలా అందంగా కనిపించింది. ఈ పాటను మైకా సింగ్, గీతా మాధురి, డి వేల్ మురుగన్ కలిసి పాడారు.
సినిమా రిలీజ్ కి రెండు రోజులు వచ్చిన ఈ పాట వాల్తేరు వీరయ్యపై అంచనాలను మరింత పెంచేసింది. దీంతో అభిమానులు అందరూ హ్యాపీగా ఉన్నారు.
మైత్రీ మువీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. జనవరి 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఆల్రెడీ విడుదలైన హిందీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.