LOADING...
War 2 : బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా 'వార్ 2' రికార్డు.. హిందీలో ఎన్నో స్థానం అంటే?
బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా 'వార్ 2' రికార్డు.. హిందీలో ఎన్నో స్థానం అంటే?

War 2 : బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా 'వార్ 2' రికార్డు.. హిందీలో ఎన్నో స్థానం అంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కాంబినేషన్‌లో వచ్చిన వార్ 2 గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది. బాలీవుడ్‌ బడా బ్యానర్‌ యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై సినిమాటిక్‌ యూనివర్స్‌లో 'వార్' చిత్రానికి సీక్వెల్‌గా, బ్రహ్మాస్త్ర ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌లో మొదటి షో నుంచే మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇద్దరు బడా స్టార్స్‌ ఉన్నప్పటికీ, కథా నేపథ్యం, స్క్రీన్‌ప్లే కంటే కేవలం యాక్షన్‌పైనే దర్శకుడు ఎక్కువగా దృష్టి సారించాడని విమర్శలు వచ్చాయి.

Details

రెండో స్థానంలో వార్ 2

అయినప్పటికీ అవి కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. బాలీవుడ్‌లో వార్ 2 సూపర్ స్టార్ట్‌ అందుకుంది. ఇండియా వ్యాప్తంగా 15,583 షోల్లో రూ. 31.97 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి, 31.40%ఆక్యుపెన్సీ సాధించింది. ఇందులో ముంబైలో రూ. 8.64 కోట్లు, ఢిల్లీలో రూ. 7.52 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్‌ సాధించిన సినిమాగా ఛావా ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండగా, వార్ 2 సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. వరల్డ్‌వైడ్‌గా మొదటి రోజు రూ. 85 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌ అంచనా. సౌత్‌లో కూలీతో భారీ పోటీ ఉన్నప్పటికీ, వార్ 2 బలమైన కలెక్షన్లు సాధించింది. మొదటి రోజు అధికారిక వసూళ్లను యూనిట్‌ వర్గాలు ప్రకటిస్తాయా అనే ఆసక్తి ఉంది.