LOADING...
Allu Arjun : అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. అల్లు అర్జున్-అట్లీ సినిమా దుబాయ్ షెడ్యూల్ రద్దు!
Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ సినిమా దుబాయ్ షెడ్యూల్ రద్దు!

Allu Arjun : అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. అల్లు అర్జున్-అట్లీ సినిమా దుబాయ్ షెడ్యూల్ రద్దు!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో భారీ స్థాయి సైన్స్ ఫిక్షన్ సినిమా రూపొందుతోంది. అంతర్జాతీయ స్థాయిలో,హాలీవుడ్ రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో కలిసి రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి హైప్ సృష్టించింది. ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పటికే ముంబైలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్‌లో చిత్రీకరించబడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ప్రపంచాన్ని కుదిపేస్తున్న అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు ఈ భారీ చిత్రంపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధ పరిస్థితులు ఇప్పటికే భారత్‌లోని పలు రంగాలపై ప్రభావం చూపుతున్నాయి.

వివరాలు 

గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు

ముఖ్యంగా వ్యాపార రంగం, గల్ఫ్ దేశాలతో సంబంధాలు కలిగిన పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సినీ రంగంపై కూడా ఈ పరిస్థితుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముంబై షెడ్యూల్ పూర్తయ్యాక,తదుపరి చిత్రీకరణను దుబాయ్‌లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. ముఖ్యంగా అల్లుఅర్జున్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8 తర్వాత అక్కడ షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమాన సర్వీసులు నిలిచిపోవడం,పలు వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో, ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ నిర్వహించడం సాధ్యం కాదని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. దీంతో దుబాయ్‌లో ప్లాన్ చేసిన షూటింగ్ షెడ్యూల్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

వివరాలు 

సినిమా రంగంపై కూడా ప్రపంచ స్థాయి రాజకీయ పరిణామాలు

ఇప్పుడు ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే వరకు షూటింగ్‌ను పూర్తిగా నిలిపివేస్తారా? లేకపోతే కొత్త లొకేషన్‌ను ఎంపిక చేసి షూటింగ్ కొనసాగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, ప్రపంచ స్థాయి రాజకీయ పరిణామాలు ఇప్పుడు మన సినిమా రంగంపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి.

Advertisement