
War 2: హ్యాష్‌ట్యాగ్ కోసం ఎన్టీఆర్-హృతిక్ మధ్య మాటల యుద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' (War 2) ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్, హృతిక్ వరుసగా ఆసక్తికర పోస్టులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఈ సినిమా విషయంలో సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ యుద్ధం కూడా మొదలైంది.
Details
హ్యాష్‌ట్యాగ్ మాత్రం నాదే హృతిక్
మొదటగా హృతిక్ రోషన్ ట్వీట్ చేస్తూ.. 'వార్ ప్రారంభమైంది. ఈ యుద్ధం గురించి చెప్పే హ్యాష్‌ట్యాగ్ ఉంది. ప్రతి పోస్టుకు '#HrithikvsNTR'ను జోడించండి. ఈ ట్యాగ్‌తోనే నేను ప్రత్యేక అప్‌డేట్స్ పంచుకుంటానని పేర్కొన్నారు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. 'మీరు అప్‌డేట్స్ పంచుకుంటామంటున్నారు, బాగుంది. కానీ మనం ముందే #NTRvsHrithik అనే హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించమని చెప్పుకున్నాం కదా! అసలు వార్ ఆ ట్యాగ్‌తోనే స్టార్ట్ కావాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై హృతిక్ మరోసారి స్పందిస్తూ.. 'మీరు చెప్పింది బాగుంది తారక్. కానీ హ్యాష్‌ట్యాగ్ మాత్రం నా దే ఉండాలి.
Details
మరో పది రోజుల్లో మూవీ రిలీజ్
ఈ విషయం పెద్దగా చేయకండని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీని వెంటనే ఎన్టీఆర్.. 'మీరు నా మాట బాగుందని అన్నారు అంటే నేనే గెలిచినట్టే సర్ అంటూ సరదాగా స్పందించారు. ఈ పోస్టులపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ, వార్ టైటిల్‌కు తగ్గట్లుగానే ఇద్దరూ వార్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో 10 రోజుల్లో ఈ యుద్ధం థియేటర్లలో ప్రారంభం కానుందంటూ ఎన్టీఆర్ పేర్కొన్నారు.