Loading...
Katrina Kaif: ట్రోల్స్‌కు భయపడితే ముందుకు సాగలేం.. కత్రినా కైఫ్‌ కీలక వ్యాఖ్యలు!
ట్రోల్స్‌కు భయపడితే ముందుకు సాగలేం.. కత్రినా కైఫ్‌ కీలక వ్యాఖ్యలు!

Katrina Kaif: ట్రోల్స్‌కు భయపడితే ముందుకు సాగలేం.. కత్రినా కైఫ్‌ కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచం మనల్ని ప్రశంసించే సందర్భాలు ఉంటాయి. అదే సమయంలో ఒక్కోసారి మనల్ని మనమే ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయని బాలీవుడ్‌ కథానాయిక కత్రినా కైఫ్‌ అంటున్నారు. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న ఆమెపై కొందరు నెటిజన్లు ట్రోల్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రసవానంతరం కత్రినా బరువు పెరిగారంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ విమర్శలపై పరోక్షంగా స్పందించిన ఆమె.. ఆత్మవిశ్వాసం, స్వీయ అంగీకారం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే విమర్శలు తమ ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడాలని కత్రినా సూచించారు.

వివరాలు

తేలిగ్గా తీసుకొని వదిలేయాలి

సోషల్‌ మీడియాలో అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయని, వాటన్నింటికీ అనుగుణంగా నడుచుకోవాలని ప్రయత్నిస్తే జీవితంలో ఏ విషయంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోలేమని అభిప్రాయపడ్డారు.

ప్రతి విమర్శకు భయపడుతూ ఉంటే జీవితంలో ముందుకు సాగడం కష్టమయ్యేదని ఆమె పేర్కొన్నారు.

అందుకే ప్రతి ఒక్కరూ తమకు తామే ప్రోత్సాహకులుగా ఉండాలని చెప్పారు. జీవితంలోని వివిధ దశల్లో మనల్ని మనం అంగీకరించుకోవడం ఎంతో ముఖ్యమని వివరించారు.

విమర్శలు, ట్రోల్స్‌ను మరీ తీవ్రంగా తీసుకోకుండా తేలికగా వదిలేయాలని కత్రినా సూచించారు. అలాగే మనల్ని మనం అతిగా సీరియస్‌గా తీసుకోకుండా ఉండటం మంచిదని అభిప్రాయపడ్డారు.

ఇతరుల అభిప్రాయాల కంటే మన ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె వ్యాఖ్యల సారాంశం.

ADVERTISEMENT