LOADING...
Vijay Devarakonda: 'వెడ్డింగ్ ఆఫ్ విరోష్' ఖరారు.. పెళ్లిపై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
'వెడ్డింగ్ ఆఫ్ విరోష్' ఖరారు.. పెళ్లిపై విజయ్

Vijay Devarakonda: 'వెడ్డింగ్ ఆఫ్ విరోష్' ఖరారు.. పెళ్లిపై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాహంపై తొలిసారి విజయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. అభిమానులు ప్రేమగా పిలుస్తున్న 'విరోష్' అనే పేరునే తమ వివాహ వేడుకకు అధికారికంగా పెట్టనున్నట్లు వెల్లడించారు.

Details

'వెడ్డింగ్ ఆఫ్ విరోష్'

విజయ్ తన పోస్టులో భావోద్వేగంగా స్పందిస్తూ - "మేం ఏ ప్లాన్ చేసినా, ఏదైనా ఎంపిక చేసుకున్నా ముందుగా అభిమానులే ఆ పని చేసి పెడుతున్నారు. ఇప్పుడు మా పెళ్లి విషయంలోనూ మీరు ఎంతో ప్రేమతో ఒక పేరు పెట్టారు. మమ్మల్ని 'విరోష్' అని పిలుస్తున్నారు. అందుకే అభిమానుల గౌరవార్థం మా వివాహ వేడుకకు 'Wedding of VIROSH' అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఇంత ప్రేమతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు ఎప్పుడూ మాలో ఒక భాగమే" అని పేర్కొన్నారు.

Details

ప్రేమ వార్తలకు బలం

ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాల తర్వాత ప్రేమలో ఉన్నారంటూ పలు రూమర్లు వినిపించాయి. ఈ విషయంపై అధికారికంగా ఎప్పుడూ స్పందించకపోయినా, సోషల్ మీడియాలో పంచుకున్న పోస్టులు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ జంట వివాహ వేడుక కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఇద్దరూ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అభిమానులు పెట్టిన పేరునే ఖరారు చేస్తూ విజయ్ పెట్టిన పోస్టు విశేషంగా మారింది. అతి కొద్ది మంది సమక్షంలో ఈ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Details

ఉదయ్ పూర్ వేదికగా పెళ్లి?

రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ఇందుకు వేదికగా ఎంపికైనట్లు సమాచారం. ఫిబ్రవరి 26న ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయ్, రష్మిక ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' చిత్రంలో నటిస్తున్నారు. దీనికి 'రాహుల్ సాంకృత్యాన్' దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

Advertisement