Loading...
Raka: 'రాకా'లో 37 అంటే..? అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో మొదలైన కొత్త చర్చ!
'రాకా'లో 37 అంటే..? అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో మొదలైన కొత్త చర్చ!

Raka: 'రాకా'లో 37 అంటే..? అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో మొదలైన కొత్త చర్చ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

37 అంటే ఏంటి? సినిమాలోని ఏదైనా పాత్రకు సంబంధించిన నంబరా? హీరో అల్లు అర్జున్‌కు కలిసొచ్చే నంబరా? లేక ఆయన వయసును సూచిస్తోందా? అసలు '37' వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానుల్లో ఇదే చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రాకా'. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌లో '37' కనిపించడమే ఈ ఆసక్తికర చర్చకు కారణమైంది. 'రాకా' టీమ్ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో షేర్ చేసింది. దీంతో సినిమా లవర్స్‌తో పాటు ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు.. ఈ '37' అంటే ఏమిటో డీకోడ్ చేసే పనిలో పడ్డారు.

వివరాలు

అట్లీ బర్త్‌డే కోసమేనా?

ఈ నెల 21న 'రాకా' చిత్ర దర్శకుడు అట్లీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆరోజు సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఆ అప్‌డేట్‌ను ఉద్దేశించే '37' నంబర్‌ను 'రాకా' మేకర్స్ తమ సోషల్ మీడియా పోస్టుల్లో ఉపయోగిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

అయితే '37' వెనుక అసలు కారణం ఏంటనే విషయంపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు.

దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో ఈ నంబర్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం 'రాకా' సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్నట్లు సమాచారం.

వివరాలు

భారీ తారాగణంతో 'రాకా'

ఈ సినిమాలో దీపికా పదుకోన్ ఓ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా కూడా ఈ చిత్రంలో భాగమయ్యారనే ప్రచారం సాగుతోంది.

మరోవైపు 'రాకా'లో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

తాత, తండ్రి, ఇద్దరు కొడుకులు.. ఇలా నాలుగు తరాలకు చెందిన పాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారని భోగట్టా. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

అయితే ప్రస్తుతం అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న ప్రశ్న మాత్రం ఒక్కటే.. 'రాకా' పోస్టర్‌లో కనిపించిన 37 అసలు దేనికి సంకేతం? దీనిపై మేకర్స్ ఇచ్చే తదుపరి అప్‌డేట్‌తోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT