LOADING...
Vijay Deverakonda - Rashmika Mandanna:విజయ్ దేవరకొండ - రష్మిక మంధన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? నెట్టింట హాట్ టాపిక్!
విజయ్ దేవరకొండ - రష్మిక మంధన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? నెట్టింట హాట్ టాపిక్!

Vijay Deverakonda - Rashmika Mandanna:విజయ్ దేవరకొండ - రష్మిక మంధన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? నెట్టింట హాట్ టాపిక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన్న జోడీకి ప్రత్యేక స్థానం ఉంది. 2018లో విడుదలైన 'గీత గోవిందం'లో వీరి రొమాంటిక్ జోడీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోగా, 2019లో వచ్చిన డియర్ కామ్రెడ్‌తో మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందన్న ప్రచారం అప్పటినుంచే ఇండస్ట్రీలో వినిపించింది. ప్రస్తుతం వస్తున్న తాజా వార్తలతో ఆ గుసగుసలు నిజమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Details

ఉదయ్‌పూర్‌లో వివాహం?

సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లోని ఓ చారిత్రక ప్యాలెస్ వేదికగా వీరి వివాహం జరగనుందట. ఇరు కుటుంబాల సమ్మతితో అత్యంత గోప్యంగా పెళ్లి వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఎంగేజ్‌మెంట్ మాదిరిగానే పెళ్లి విషయాన్ని కూడా పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచాలని ఈ జంట భావిస్తున్నట్లు సమాచారం. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ వివాహానంతరం మార్చి 4న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం.

Details

వయసు తేడాపై చర్చ

విజయ్ దేవరకొండ 1989 మే 9న జన్మించగా, రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5న జన్మించారు. అంటే వీరిద్దరి మధ్య సుమారు ఏడు సంవత్సరాల వయసు తేడా ఉంది. ఈ అంశం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే సినీ రంగంలో ఇలాంటి ఏజ్ గ్యాప్‌లు సాధారణమేనని, అసలు ముఖ్యమైనది పరస్పర అవగాహన, ప్రేమేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Details

రిలేషన్‌షిప్‌లో గోప్యత

విజయ్, రష్మిక ఎప్పుడూ తమ వ్యక్తిగత సంబంధంపై బహిరంగ ప్రకటన చేయలేదు. అయితే సోషల్ మీడియాలో ఇచ్చిన చిన్న హింట్స్, ఒకే లొకేషన్లలో కనిపించడం, వెకేషన్ ఫోటోలు వంటి అంశాలు అభిమానులకు సంకేతాలిచ్చాయి. ఇప్పుడు పెళ్లి వార్తలు కూడా అదే గోప్యతతో వెలువడటం వీరి స్టైల్‌ను ప్రతిబింబిస్తోంది. అభిమానుల్లో సంబరాలు 'గీత గోవిందం' రోజుల్లో మొదలైన ఈ ప్రేమకథ ఇప్పుడు పెళ్లి దశకు చేరిందన్న వార్తలతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. "రీల్ లైఫ్ జంట రియల్ లైఫ్‌లోనూ ఒక్కటవడం అదృష్టం" అంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.

Advertisement