Loading...
The Paradise: నాని 'ది ప్యారడైజ్' ట్రైలర్ ఎప్పుడు? మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
నాని 'ది ప్యారడైజ్' ట్రైలర్ ఎప్పుడు? మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

The Paradise: నాని 'ది ప్యారడైజ్' ట్రైలర్ ఎప్పుడు? మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో ఇప్పటివరకు చూడని మాస్ అవతార్‌లో కనిపించబోతున్న చిత్రం 'ది ప్యారడైజ్'. 'దసరా' సినిమాతో నానికి భారీ విజయాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి మరోసారి దర్శకత్వం వహిస్తుండటంతో.. మొదటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు అనిరుధ్ రవిచందర్ అందించిన 'ఆయా షేర్', 'యేశ నాగుల కట్టమీద' వంటి మాస్ సాంగ్స్ ఇప్పటికే సినిమాపై బజ్‌ను మరింత పెంచాయి. ఇప్పటికే 'ది ప్యారడైజ్' సినిమా రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండకూడదనే ఉద్దేశంతో చిత్రబృందం పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT