Nayanthara: సినిమాకు రూ.15 కోట్లు.. యాడ్‌కు రూ.5 కోట్లు.. డైరెక్టర్‌ను పెళ్లి చేసుకున్న సౌత్ టాప్ హీరోయిన్ ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సౌత్ ఇండియాలోనే టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్న ఈ స్టార్ హీరోయిన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ, యాడ్‌కు సుమారు రూ.5 కోట్లు వసూలు చేస్తోంది. మొత్తం నెట్ వర్త్ దాదాపు రూ.200 కోట్లుగా అంచనా. డైరెక్టర్‌ను వివాహం చేసుకున్న ఈ భామ ఎవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార
Details
నయనతార క్రేజ్
సౌత్‌లో నయనతారకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవల చిరంజీవితో కలిసి తెలుగులో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో నటించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మలయాళంలో 'పేట్రియాట్' చిత్రంలో నటిస్తోంది. ఇందులో మమ్ముట్టి, మోహన్ లాల్‌తో కలిసి నటిస్తున్నారు. ఇక కన్నడలో యష్ హీరోగా నటించిన 'టాక్సిక్' చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది.
Details
అదిరే రెమ్యునరేషన్
లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఒక్కో సినిమాకు సుమారు రూ.15 కోట్లు తీసుకుంటోందని టాక్. ఒక యాడ్ కోసం ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తుందని సమాచారం. కేవలం 50 సెకన్ల యాడ్‌కే ఈ భారీ మొత్తం అందుకుందని తెలుస్తోంది. రెండు రోజుల్లో ఆ యాడ్ షూటింగ్ పూర్తి అయ్యిందని చెబుతున్నారు. నెట్ వర్త్ సినిమాలు, యాడ్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్, ఇతర పెట్టుబడుల ద్వారా నయనతార భారీగా సంపాదిస్తోంది. ఆమె నెట్ వర్త్ సుమారు రూ.200 కోట్లుగా అంచనా. ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు ప్రచారం ఉంది. తమిళ దర్శకుడు విష్నేష్‌ను వివాహం చేసుకున్న నయనతారకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలీవుడ్‌లో జవాన్ చిత్రంతో ఆమె సంచలనం సృష్టించింది.
Details
రాబోయే సినిమాలు
తెలుగులో నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'NBK 111' (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నయనతార నటిస్తోంది. మలయాళంలో 'పేట్రియాట్'తో రీఎంట్రీ ఇస్తోంది. అలాగే 'డియర్ స్టూడెంట్స్', 'పట్టు' అనే మరో రెండు మలయాళ చిత్రాల్లోనూ నటిస్తోంది. అమ్మవారిగా కనిపించిన మూకుతి అమ్మన్ సీక్వెల్ 'మూకుత్తి అమ్మన్ 2' కూడా త్వరలో విడుదల కానుంది. తమిళంలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, కన్నడలో నటించిన 'టాక్సిక్' చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.