Loading...
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల షాక్.. భారత్ విడిచి వెళ్లాలంటూ నోటీసులు జారీ
ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల షాక్.. భారత్ విడిచి వెళ్లాలంటూ నోటీసులు జారీ

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల షాక్.. భారత్ విడిచి వెళ్లాలంటూ నోటీసులు జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు.భారత పౌరుడు కాకపోయినా రాజకీయ నిరసనలో పాల్గొన్నందుకు ఇమ్రాన్‌పై ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే..ఈ నెల 10న ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదానంలో 'కాక్‌రోచ్ జనతా పార్టీ'(సీజేపీ) ఆధ్వర్యంలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళనలో ఇమ్రాన్ ఖాన్ తన భాగస్వామి,నటి లేఖా వాషింగ్టన్‌తో పాటు తన కజిన్ జేన్ మేరీ ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఇమ్రాన్ ఖాన్ సహా సుమారు 400మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు.

వివరాలు 

ఆయన అమెరికా పౌరుడని, ఓసీఐ కార్డు హోల్డర్ అని సమాచారం

అయితే,ఇమ్రాన్ ఖాన్ భారత పౌరుడు కాదని, అమెరికా పౌరసత్వంతో పాటు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కలిగి ఉన్నారని పోలీసులు గుర్తించారు.

భారత పౌరుడు కానప్పటికీ రాజకీయ నిరసనలో పాల్గొన్నందున ఇమ్మిగ్రేషన్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

అక్టోబర్ 28లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. నిరసన సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో ఓ ఫొటోను పంచుకున్నారు.

పోలీసు వ్యాన్‌లో ఉన్న ఆ ఫొటోకు "నేను డ్రైవ్‌కు వెళ్తున్నట్లున్నాను" అనే క్యాప్షన్ జోడించారు.

అంతేకాకుండా, పోలీసులతో కలిసి 'జై హింద్' అని చెబుతున్న ఆయన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వివరాలు 

రెండు గంటల పాటు పోలీసు వ్యాన్‌లో తిప్పి..

తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియదని, సుమారు రెండు గంటల పాటు పోలీసు వ్యాన్‌లో తిప్పిన తర్వాత తనను విడుదల చేశారని ఇమ్రాన్ ఖాన్ గతంలో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ నిరసన కార్యక్రమంలో తుషార్ గాంధీ నేతృత్వంలోని 'హమ్ భారత్ కే లోగ్' సంస్థ ప్రతినిధులు, సీపీఐ(ఎం) కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా ఇమ్రాన్ ఖాన్‌కు దేశం విడిచి వెళ్లాలంటూ నోటీసులు జారీ కావడంతో ఈ వ్యవహారం బాలీవుడ్‌లో చర్చకు దారితీసింది.

ADVERTISEMENT