Rashmika : రష్మిక సోలో స్టార్‌గా మారుతుందా? 'మైసా'తో సత్తా చాటుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
వరుసగా పాన్ ఇండియా సినిమాలు.. స్టార్ హీరోలతో క్రేజీ కాంబినేషన్స్‌తో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఓ సినిమాలో తన షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఆమె నటనపై చిత్ర బృందం ప్రశంసలు కురిపించింది. దీంతో రష్మిక తన కెరీర్‌లో మరో కీలక దశకు చేరుకున్నారా అనే చర్చ మొదలైంది. అయితే 'మైసా'తో రష్మిక సోలో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటుందా? లేక స్టార్ హీరోల సినిమాల్లో విజయవంతమైన హీరోయిన్‌గానే కొనసాగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
వివరాలు
'రణబాలి'లో మరోసారి విజయ్‌తో..
విజయ్ దేవరకొండతో రష్మికకు ఉన్న కాంబినేషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి జోడీకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.
అయితే 'రణబాలి'లో మాత్రం జయమ్మ పాత్రలో రష్మిక కనిపించనుండటంతో ఈ జోడీ మరోసారి కొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ముఖ్యంగా రష్మిక బేబీ బంప్‌తో కనిపించిన వీడియో ప్రస్తుతం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఈ పాత్రను ప్రత్యేకంగా కేర్ తీసుకుని రాసుకున్నట్లు తెలుస్తుండగా.. జయమ్మ పాత్ర గురించి దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు.
ఇక 'రణబాలి'లో రష్మికకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. దీంతో ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం 'మైసా'పైనే ఉంది.
వివరాలు
'మైసా'లో మాస్ యాక్షన్ అవతార్
రష్మిక కెరీర్‌లో 'మైసా' మరో కొత్త ప్రయోగంగా నిలవనుంది. ఇప్పటివరకు ఆమె ఎక్కువగా గ్లామర్, లవ్, ఫ్యామిలీ క్యారెక్టర్స్‌లో కనిపించారు.
అయితే 'మైసా'లో మాత్రం మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలోని అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది.
రష్మికను ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
సోలో స్టార్‌గా నిలుస్తుందా?
రష్మిక అప్‌కమింగ్ లిస్ట్‌ను పరిశీలిస్తే వరుసగా పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి.
స్టార్ హీరోల సినిమాల్లో భాగమై సక్సెస్‌లో భాగస్వామి కావడం ఒక ఎత్తయితే.. తన పేరుతోనే ఓ సినిమాను విజయవంతం చేయడం మరో ఎత్తు.
ఇప్పటివరకు స్టార్ హీరోలతో కలిసి వరుస విజయాలను అందుకున్న రష్మిక.. 'మైసా'తో తన సొంత ఇమేజ్‌తో సినిమాను నడిపించే స్థాయికి చేరుకుంటుందా? సోలో స్టార్‌గా తన సత్తాను చాటుతుందా? అనేది చూడాలి.