LOADING...
Samyuktha: ఉమెన్స్ డే స్పెషల్.. 'ది బ్లాక్ గోల్డ్'లో సంయుక్త పవర్‌ఫుల్ అవతారం
ఉమెన్స్ డే స్పెషల్.. 'ది బ్లాక్ గోల్డ్'లో సంయుక్త పవర్‌ఫుల్ అవతారం

Samyuktha: ఉమెన్స్ డే స్పెషల్.. 'ది బ్లాక్ గోల్డ్'లో సంయుక్త పవర్‌ఫుల్ అవతారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2026
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో లక్కీ చార్మ్‌గా గుర్తింపు పొందిన సంయుక్త మీనన్ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన ప్రతిభను మరోసారి చాటుకుంటోంది. ఉమెన్స్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'ది బ్లాక్ గోల్డ్' నుంచి చిత్రబృందం పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను చూస్తేనే సినిమాలో సంయుక్త ఫియర్‌లెస్, శక్తివంతమైన పాత్రలో కనిపించబోతుందని స్పష్టమవుతోంది. 'ఆయుధాల కంటే న్యాయాన్ని నమ్మే మహిళ' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పాత్రను పరిచయం చేశారు. పోస్టర్‌లో సంయుక్త లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని యోగీ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Details

త్వరలోనే విడుదల తేదీ ప్రకటన

ఇక సంయుక్త గతంలో బింబిసార, విరుపాక్ష వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకుంది. ఇప్పుడు ఈ ప్రయోగాత్మక చిత్రంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ సినిమాకు స్యామ్ సి.ఎస్ సంగీతం అందిస్తుండగా, పాటలకు రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందిస్తున్నారు. ఉమెన్స్ డే రోజున ఒక మహిళా ప్రధాన చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ రావడంతో నెటిజన్లు సంయుక్తకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఆధారిత కథలను ఎంచుకుంటున్న సంయుక్తపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement