Womens Day Special: లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొట్టిన అందగత్తెలు వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
హీరోయిన్లు తమ ప్రతిభతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ముఖ్యంగా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాలు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
అనేక అవార్డులను కైవసం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించిన టాప్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు పరిశీలిద్దాం.
వివరాలు
విజయశాంతి
టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మారుపేరు. ముఖ్యంగా ఓసేయ్ రాములమ్మ చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇప్పటికీ "ఓసేయ్ రాములమ్మ" అనే మాట వినగానే చాలామంది విజయశాంతిని గుర్తు చేసుకుంటారు. ఆ పాత్రలో ఆమె అంతగా ఒదిగిపోయారు.
అనుష్క శెట్టి
అరుంధతి సినిమాతో టాలీవుడ్‌ను కుదిపేసిన ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. వరుస విజయాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఈ నటి, మహిళా ప్రధాన చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అందాల తార ఘాటీ అనే చిత్రంతో అభిమానుల ముందుకు రానుంది.
వివరాలు
సమంత
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ,స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఈ నటి, తన నటనతో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. యశోద వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.
నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార తన విశిష్టమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది.ఏ సినిమాకైనా తగినట్లు ఒదిగిపోతూ,నటనలో తన నైపుణ్యాన్ని చాటుకుంది. అనామిక,ఐరా,కర్తవ్యం వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన ప్రతిభను ప్రదర్శించి, ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
సాయిపల్లవి
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి,గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన గార్గి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.తన నైజత్వంతో,అసాధారణమైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది.