NTR : వామ్మో ఎన్టీఆర్ ట్రాన్స్‌ఫర్మేషన్.. డ్రాగన్ కోసం కండలు తిరిగిన బాడీ!
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డ్రాగన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు భారీగా ఎదురుచూస్తుండగా, ఇప్పటికే ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సిద్ధమవుతూ ఎన్టీఆర్ తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. గతంతో పోలిస్తే బాగా సన్నబడిన లుక్‌లో ఇటీవల షూటింగ్ సమయంలో, బయట కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఎన్టీఆర్ ఇంత సన్నగా మారిపోయాడా?" అనే చర్చలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో కండలు తిరిగిన బాడీతో ఒక ఫోటోను షేర్ చేశాడు.
వివరాలు
పవర్‌ఫుల్‌గా ఎన్టీఆర్ లుక్
ఆ ఫోటోకు "ఇది పెంచుకున్నది, కొనుక్కున్నది కాదు" అనే క్యాప్షన్ జోడించడం విశేషం. ఈ స్థాయి ఫిట్‌నెస్ సాధించడంలో కోచ్ కుమార్ మన్నవ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. అలాగే ఈ ఫోటోను 'డ్రాగన్' సినిమాకు ట్యాగ్ చేయడం ద్వారా, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ పూర్తిగా ఆ సినిమా కోసమేనని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. దీంతో 'డ్రాగన్'లో ఎన్టీఆర్ లుక్ మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని, సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించే అవకాశముందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు లావుగా ఉన్నాడని వచ్చిన ట్రోల్స్‌కు తన కఠిన శ్రమతో సమాధానం ఇచ్చిన ఎన్టీఆర్, ఇప్పుడు మరోసారి తన ఫిట్‌నెస్‌తో 'డ్రాగన్' సినిమాలో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.