Loading...
Yash: 'టాక్సిక్‌' కోసం భారీ ప్రాజెక్ట్‌ వదులుకున్న యశ్‌.. అసలు కథ ఇదే!
'టాక్సిక్‌' కోసం భారీ ప్రాజెక్ట్‌ వదులుకున్న యశ్‌.. అసలు కథ ఇదే!

Yash: 'టాక్సిక్‌' కోసం భారీ ప్రాజెక్ట్‌ వదులుకున్న యశ్‌.. అసలు కథ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2026
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

యశ్‌కు (Yash) ఇండియానా జోన్స్‌ తరహా అడ్వెంచర్‌ కథను వినిపించానని, అయితే ఆ ప్రాజెక్ట్‌ ముందుకు సాగలేదని దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ తెలిపారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్దార్‌ 2' (Sardar 2) సెప్టెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిత్రన్‌.. యశ్‌కు తాను వినిపించిన కథ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ''యశ్‌కు నేను ప్రతిష్ఠాత్మకమైన ఓ కథ వినిపించా. అందులో చాలా బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. ఇండియానా జోన్స్‌ తరహాలో సాగే అడ్వెంచర్‌ స్టోరీ అది. నిజానికి అది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఆ కథను సినిమాగా రూపొందించి ఉంటే అద్భుతంగా ఉండేది.

వివరాలు

యశ్‌ 'టాక్సిక్‌'పై ఓటీటీ వార్తలు

అయితే అప్పట్లో యశ్‌కు సమయం లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నారు. దీంతో ఆ కథ నెరేషన్‌ దశలోనే ఆగిపోయిందని పీఎస్‌ మిత్రన్‌ చెప్పారు.

అడల్ట్‌ కంటెంట్‌తో పాటు పెద్దగా భావోద్వేగాలు లేని గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాలో నటించడం కంటే.. బలమైన ఎమోషన్స్‌తో కూడిన అడ్వెంచర్‌ సినిమాను యశ్‌ ఎంపిక చేసుకుని ఉంటే బాగుండేదని మిత్రన్‌ అభిప్రాయపడ్డారు.

ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన యశ్‌ 'టాక్సిక్‌' (Toxic) సినిమా అభిమానులను నిరాశపర్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ డీల్‌పై రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. గతంలో 'టాక్సిక్‌' డిజిటల్‌ హక్కులను రూ.150 కోట్లకు దక్కించుకునేందుకు ఓ సంస్థ ప్రయత్నించినట్లు సమాచారం.

వివరాలు

ఇప్పటివరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు

అయితే ఇప్పుడు అదే సంస్థ కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఆఫర్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

'టాక్సిక్‌' భారీ విజయం సాధిస్తుందని భావించిన చిత్రబృందం.. అప్పట్లో వచ్చిన రూ.150 కోట్ల ఓటీటీ డీల్‌కు అంగీకరించలేదని తెలుస్తోంది.

అంతేకాకుండా రూ.200 కోట్లు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అయితే ఈ ఓటీటీ డీల్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT