Page Loader
Ye Chota Nuvvunna: 'ప్రేమ కథలు చూడటానికి, చదవడానికి చాలా బాగుంటాయి'.. ఆకట్టుకున్న ట్రైలర్ 
Ye Chota Nuvvunna: 'ప్రేమ కథలు చూడటానికి, చదవడానికి చాలా బాగుంటాయి'.. ఆకట్టుకున్న ట్రైలర్

Ye Chota Nuvvunna: 'ప్రేమ కథలు చూడటానికి, చదవడానికి చాలా బాగుంటాయి'.. ఆకట్టుకున్న ట్రైలర్ 

వ్రాసిన వారు Stalin
Nov 13, 2023
06:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

Ye Chota Nuvvunna : ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమకథని నేపథ్యంగా తీసుకోని తెరకెక్కించిన సినిమా 'ఏ చోట నువ్వున్నా'. వాస్తవానికి దగ్గరగా ఉండేలా తీసి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో సోమవారం జరిగింది. ప్రశాంత్ గురవన, అంబికా ముల్తానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మూవీ ట్రైలర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. యూత్ ఆకట్టుకునేలా ఉండే ట్రైలర్‌ను చూస్తే.. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాకు ఎస్ వి.పసలపూడి దర్శకత్వం వహించారు.

సినిమా

ఆకట్టుకున్న డైలాగులు

'ప్రేమ కథలు చూడటానికి, చదవడానికి చాలా బాగుంటాయి, కానీ అదే ప్రేమ మన జీవితం నుంచి వెళ్లిపోయినప్పుడు..' డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభవుతుంది. 'ప్రేమించడానికి ఉద్యోగం అవసరం లేదు. కానీ పెళ్లి చేసుకోవడానికి ఉద్యోగం తప్పనిసరి' అనే డైలాగులతో ట్రైలర్ ఆకట్టుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన వారిలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకులు వి.ఎన్ ఆదిత్య, ఎ. ఎస్ రవికుమార్ చౌదరి, నర్రా శివనాగు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఉన్నారు.