2023లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ జలపాతాలను లిస్ట్ లో చేర్చుకోండి
2022 పూర్తయిపోతోంది. ఇంకో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అప్పుడే ఆ సంవత్సరంలో ఏమేం చేయాలనే లిస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఆ లిస్ట్ లో తప్పకుండా ట్రావెలింగ్ గురించి ఉంటుంది. 2023లో మీ ట్రావెల్ ప్లాన్ ని మరింత ఆహ్లాదంగా మార్చుకోవడానికి ఈ జలపాతాలను మీ లిస్ట్ లో చేర్చుకోండి. దూద్ సాగర్: గోవాలోని మండోవా నది మీద ఉన్న ఈ జలపాతం, ఇండియాలో అతి ఎత్తయిన జలపాతాల్లో ఒకటి. ఎక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి కిందపడుతున్న నీళ్ళు పాలధారలా కనిపిస్తాయి. అందుకే పాలసముద్రం అని అర్థం వచ్చేలా దూద్ సాగర్ అని పెట్టారు. పనాజీ నుండి 60కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో అందంగా ఉంటుంది.
మరిన్ని జలపాతాలు
అత్తిరిపల్లి: ఇండియా నయాగరా గాపిలుచుకునే ఈ జలపాతం కేరళలో ఉంది. కోచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. హోగెనాక్కల్ జలపాతం: హోగెనాక్కల్ అంటే పొగ వదులుతున్న కొండలు అని అర్థం. తమిళనాడులో ఉన్న ఈ జలపాతం, 66అడుగుల ఎత్తు నుండి పడుతుండడంతో కొండల మీద నుండి పొగ వస్తున్న భ్రమ కలుగుతుంది. ఎలిఫెంట్ జలపాతం: మేఘాలయ రాష్ట్రంలో షిల్లాంగ్ నగర శివార్లలో ఉన్న ఈ జలపాతం, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చలికాలం, వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. నోహ్ కలికై జలపాతం: చిరపుంజిలో ఉన్న ఈ జలపాతాన్ని చూడాలంటే గువహతి ఎయిర్ పోర్ట్ లో దిగి 12కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా వెళ్లాలి.