Page Loader
Amaravati: రాజధాని అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రుణం.. నవంబరులో నిర్మాణ పనుల ప్రారంభం
రాజధాని అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రుణం.. నవంబరులో నిర్మాణ పనుల ప్రారంభం

Amaravati: రాజధాని అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రుణం.. నవంబరులో నిర్మాణ పనుల ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా పనులు సాగుతున్నాయి. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కలిసి రూ.15,000 కోట్ల రుణం అందించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, కేంద్రం నుంచి లభించిన సహకారం కారణంగా రుణం త్వరలోనే విడుదల కానుంది. ఈ రుణం రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి, భూసమీకరణలో రైతులకు కేటాయించిన స్థలాల అభివృద్ధి, పరిపాలన నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం వంటి భవనాల నిర్మాణానికి వినియోగించనున్నట్లు తెలుస్తోంది. సీఆర్‌డీఏ అంచనాల ప్రకారం మొత్తం నిర్మాణ పనులకు రూ.49వేల కోట్లు అవసరమవుతుందని పేర్కొన్నారు.

Details

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి అనుమతులు

ఈ రుణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అనుమతులు వేగంగా అందించింది. నవంబరు 15 నాటికి సంతకాల ప్రక్రియ పూర్తి కానుంది. దీనిలో 25% అంటే, రూ.3,750 కోట్లు అడ్వాన్సుగా నవంబరులోనే లభించే అవకాశం ఉంది. డిసెంబరు నుంచి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని సీఆర్‌డీఏ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థలు సాధారణంగా రుణమంజూరు ప్రక్రియను చాలా కాలం తీసుకుంటాయి. కానీ అమరావతి నిర్మాణానికి అతి వేగంగా ఆమోదం లభించడం విశేషం. రుణంపై 15 ఏళ్ల మారటోరియం ఉంటుందని, వడ్డీ రేటు 4%లోపే ఉంటుందని, ఇందులో 90% కేంద్రం, 10% రాష్ట్రం భరించనున్నట్లు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.